పరారై ప్రేమజంట ఆత్మహత్య: లారీ దూసుకెళ్లి మృతి

మృతుల దగ్గర లభించిన సెల్‌ఫోన్ ఆధారంగా ఆనురాధపై కోటగిరి పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైందిదని రైల్వేపోలీసులు తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతి చెందిన ఇరువురు మైనర్లుగా తెలుస్తోంది.
ఇదిలావుంటే, కరీంనగర్ జిల్లాలోని సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి శివారులో దారుణం జరిగింది. గత అర్థరాత్రి రైసుమిల్లులో నిద్రిస్తున్న వారిపై లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల సర్పంచిపై హత్యాయత్నం జరిగింది. సర్పించి ముక్కిరాల కృష్ణపై ముగ్గురు దండగులు గొడ్డళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన కృష్ణ నల్లగొండలోని ఆస్పత్రికి చికిత్స పొందుతున్నాడు.












Click it and Unblock the Notifications