కరోనాను లెక్క చెయ్యని ప్రేమికులు .. పెళ్ళికి పెద్దలు అంగీకరించరని ఆత్మహత్య
ఇది కరోనా కాలం . ఎవరూ ఊహించని కష్టకాలం . లాక్ డౌన్ నేపధ్యంలో ప్రజలు అందరూ ఇళ్లకే పరిమితం అవుతున్న కాలం . ఇక ఇలాంటి కాలంలో కరోనా వల్ల దేశం మొత్తం కుదేలవుతున్నా, ఈ పరిస్థితుల నుండి ఎప్పుడు బయట పడతాం భగవంతుడా అని అందరూ బాధ పడుతున్నా ఆ ప్రేమికుల జంటకు అవేవీ పట్టలేదు. కరోనా గురించి అంతా ఆలోచిస్తుంటే ఆ జంట మాత్రం తమ ప్రేమ బంధాన్ని పెళ్లి దాకా తీసుకు వెళ్ళటానికి ఇష్టపడని తమ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించారు . ఇప్పుడు ఉన్న పరిస్థితుల తర్వాత కుటుంబ సభ్యులను ఏదో రకంగా నచ్చజెప్పి పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన మానేసి ప్రాణం తీసుకున్నారు .
గుంటూరు జిల్లాలో జరిగిన ప్రేమజంట విషాదాంత కథ వివరాల్లోకి వెళ్తే ప్రేమ వివాహాన్ని పెద్దలు అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం ఒక ప్రైవేట్ ఆస్పత్రి పని చేస్తున్న ఒక యువతీ, ఒక ప్రైవేట్ బ్యాంక్ లో పని చేస్తున్న యువకుడు ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇక వీరి ప్రేమ కాలేజీలో చదువుకుంటున్నప్పటి నుంచే కొనసాగింది . ఇక వీరి పెళ్ళికి పెద్దలు అంగీకరించరని భావించారు. రెండు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఆస్పత్రికి వెళ్ళిన యువతి రెండు రోజులుగా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు యువతి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆమె బ్రాడీపేటలో ఉన్నట్టు గుర్తించి అక్కడికి చేరుకున్నారు. అక్కడ యువతీయువకులు ఇద్దరూ విగతజీవులై కనిపించారు. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఇక సంఘటనా స్థలంలో క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తుంది. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం పంపించారు .
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications