ప్రేమజంట ఆత్మహత్యాయత్నం, ప్రియుడి మృతి
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రేమించుకున్న యువతి, యువకుడు ప్రేమను పెద్దల సమక్షంలో పెళ్లిగా మార్చుకోవాలని భావించారు. అంతలోనే వారు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
ఈ ఘటనలో యువకుడు మృతి చెందాడు. ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా కామవరపు మండలం తడికెలపూడిలో చోటు చేసుకుంది.

కాగా, పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడం వల్లనే వారు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
మృతి చెందిన ప్రియుడి పేరు వెంకటేష్, అతనిది వ్యవసాయ కుటుంబం. స్థానికంగా ఉన్న ఓ పామాయిల్ కంపెనీలో పని చేసే యువతితో పరిచయం ఏర్పడి, ప్రేమగా మారింది. పెద్దలు పెళ్లికి అంగీకరించక పోవడంతో వారు పురుగుల మందు తాగారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications