నేడే చంద్రగ్రహణం: ఏపీలో ప్రముఖ ఆలయాల మూసివేత; పునః దర్శనాలిలా!!

నేడు చంద్రగ్రహణం. 2023 లో చివరి చంద్ర గ్రహణం ఈరోజు ఏర్పడనుంది. ఈరోజు అర్ధరాత్రి 1.06 నిమిషాల నుండి 2 గంటల 24 నిమిషాల వరకు చంద్రగ్రహణం ఏర్పడనుంది. చంద్ర గ్రహణం కారణంగా నేడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాలు మూతపడుతున్నాయి. ఇక ఏ ఆలయం ఎప్పుడు మూతపడుతుంది.. తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుంది అన్న వివరాల విషయానికి వస్తే..

అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం అక్టోబర్ 28 రాత్రికి మూసివేయబడుతుంది. అక్టోబర్ 29న తిరిగి తెరవబడుతుంది. అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున 1:05 నుండి తెల్లవారుజామున 2:22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తవుతుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు వేయడం ఆనవాయితీ కావడంతో 28 రాత్రి తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు.

Lunar eclipse today: famous temples close due to chandra grahan today; here is the details

అనంతరం శ్రీవారి ఆలయాన్ని రేపు అక్టోబరు 29వ తేదీ తెల్లవారుజామున 3:15 గంటలకు ఏకాంతంలో శుద్ధి, సుప్రభాత సేవ నిర్వహించి ఆలయ తలుపులు తెరుస్తారు. నేడు చంద్రగ్రహణం కారణంగా ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయం తోపాటు, ఇతర ఉప ఆలయాలను మూసివేయనున్నారు. నేడు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు అమ్మవారికి పంచహారతులు సేవ అనంతరం ఆలయాలను మూసివేయనున్నారు.

రేపు తెల్లవారుజామున మూడు గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి అమ్మవారికి స్నపనాభిషేకం, నిత్య అలంకరణ పూజలు చేస్తారు. ఉదయం 9 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తారు. ఇదిలా ఉంటే పాక్షిక చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని మూసివేయనున్నారు . ఈరోజు మూడు గంటల 30 నిమిషాల వరకే భక్తులకు దర్శనాన్ని అనుమతిస్తున్నారు. సాయంత్ర 5 గంటలకు మల్లన్న ఆలయంతో పాటుగా ఉప ఆలయాలు ద్వారాలు మూసివేయనున్నట్లు వెల్లడించారు.

రేపు ఉదయం 5 గంటలకు మళ్లీ ఆలయ ద్వారాలు తెరిచి సంప్రోక్షణ చేసి పూజ అనంతరం ఏడు గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఇదిలా ఉంటే చంద్రగ్రహణం కారణంగా సింహాచలం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నేడు సాయంత్రం మూతపడనుంది. తిరిగి రేపు ఉదయం 8 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+