Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ చట్టసభల్లో విప్, చీఫ్ విప్ హోదాలను రద్దు చేస్తూ జీవో జారీ చేసిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పాలన మొదలైంది. టీడీపీ నేతల నామినేటెడ్ పదవులకు చెక్ పడుతుంది . శాసన సభ, శాసన మండలిలో ప్రభుత్వ విప్, చీఫ్ విప్ హోదాలను రద్దు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. చట్టసభల్లో చీఫ్ విప్, విప్ హోదాలను రద్దు చేస్తూ ఆయన జీవో జారీ చేశారు.

మే 29 తర్వాత చంద్రబాబు నాయుడు రాజీనామాతో రాష్ట్రంలో మంత్రి మండలి, ప్రభుత్వ విప్ ల వ్యవస్థ రద్దు అయిందని తెలిపారు. దీంతో చట్టసభల్లో తొమ్మిదిమంది ప్రభుత్వ విప్ పదవులను కోల్పోయారని ఆయన స్పష్టం చేశారు . అటు శాసన మండలిలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ లు విప్ పదవులను కోల్పోయారు. త్వరలో ప్రభుత్వ విప్ , ప్రభుత్వ చీఫ్ విప్ పదవులను వైయస్ జగన్ ప్రభుత్వం ఎంపిక చేయనుంది.

LV Subramanyam issued by G.O to dissolve whip and chief whip positions in AP legislative council

మే 25, 2019 నుంచి 9 మంది సభ్యులు విప్ హోదా కోల్పోయారు. ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. 150కి పైగా అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందింది. టీడీపీ ఘోర వైఫల్యం చెందింది. 23 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో టీడీపీ అధికారం కోల్పోయింది. చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చేశారు. మే 30, 2019 వ తేదీన విజయవాడలో జగన్ ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. పాలనపై దృష్టి సారించారు. వివిధ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో పదవుల్లో ఉన్న టీడీపీ నేతలు పదవులను కోల్పోతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+