Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జనసేన బందరు సభకూ రైతుల సాయం ! ఏకంగా 100 ఎకరాల స్ధలం ? ఇప్పటాన్ని మించిన దానం..!

పదో ఆవిర్భావదినోత్సవ సభను అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్న జనసేనపార్టీకి మచిలీపట్నం రైతులు గుడ్ న్యూస్ చెప్పారు.

మచిలీపట్నం : జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభను కృష్ణాజిల్లా మచిలీపట్నంలో నభూతో అన్న రీతిలో నిర్వహించేందుకు పవన్ కళ్యాణ్ సిద్దమవుతున్నారు. ఈ సభ ద్వారా ఏపీ రాజకీయాల్లో ఎన్నికలకు ముందు కీలక సంకేతాలు పంపేందుకు వ్యూహరచన చేస్తున్నారు. అలాగే ఈ సభకు భారీగా జనసమీకరణ కూడా చేస్తున్నారు. ఈ ప్రయత్నాలకు మచిలీపట్నం రైతులు అండగా నిలిచారు. ఏకంగా 100 ఎకరాల భూమిని ఈ సభ నిర్వహణ కోసం జనసేన పార్టీకి ఇచ్చారు.

బందరులో జనసేన సభ

బందరులో జనసేన సభ

బందరులో ఈ నెల 14న జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ జరగబోతోంది. ఈ సభలో పవన్ కళ్యాణ్ తో పాటు జనసేనకు చెందిన ముఖ్య నేతలంతా పాల్గొనబోతున్నారు. ఈ సభ ద్వారా ఎన్నికల శంఖారావం పూరించాలని పవన్ కళ్యాణ్ పట్టుదలగా ఉన్నారు. అందుకే ఈ సభను రాజకీయ బల ప్రదర్శనగా మలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు భారీగా జనసమీకరణ చేపట్టడంతో పాటు ఏర్పాట్లు కూడా నభూతో అన్న రీతిలో ఉండేలా చూస్తున్నారు. ఇప్పటికే అక్కడ పాగా వేసిన జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్, ఇతర నేతలు ఈ దిశగా స్ధానికులతో చర్చలు జరుపుతున్నారు. ఇందులో స్ధానికంగా వారికి ఊహించని రీతిలో సహకారం లభిస్తోంది.

సభకు వంద ఎకరాలు ఆఫర్ చేసిన రైతులు

సభకు వంద ఎకరాలు ఆఫర్ చేసిన రైతులు

మచిలీపట్నంలో మార్చి 14న జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు భారీగా జనసమీకరణ చేస్తున్నారు. ఇందుకోసం భారీగా స్ధలం కూడా అవసరమొచ్చింది. దీంతో స్ధానిక రైతులతో జనసేన నేతలు మాట్లాడారు. వారు ముందుగా 34 ఎకరాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆ తర్వాత మరో 60 ఎకరాలు కూడా ఇచ్చేందుకు ఆఫర్ ఇచ్చారు. దీంతో ఎంత స్ధలం తీసుకోవాలనే దానిపై జనసేన నేతలు చర్చిస్తున్నారు. 34 ఎకరాల స్ధలం కూడా సరిపోతుందని భావిస్తున్నా.. జనసేన సత్తా చాటాలంటే మిగతా స్ధలం కూడా తీసుకుంటే మంచిదనే భావన కూడా పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్ర రాజకీయ చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో ఆవిర్భావ సభ జరగనుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇప్పటికే సభ నిర్వహించుకునేందుకు 34 ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని, దానికి అదనంగా మరో 60 ఎకరాల భూమినీ సభ అవసరాల నిమిత్తం ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం అనందంగా ఉందన్నారు.

ఇప్పటం అనుభవాల నేపథ్యంలో ?

ఇప్పటం అనుభవాల నేపథ్యంలో ?

గతేడాది గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ 9వ ఆవిర్బావ సభ నిర్వహించారు. ఇందుకోసం స్ధానికంగా ఉన్న రైతులు 20 ఎకరాల మేర సభ కోసం, మరో 50 ఎకరాలు పార్కింగ్ కోసం తమ పొలాలు ఇచ్చారు. దీంతో జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా పార్టీ ఆవిర్భావ సభలో సభ నిర్వహణ కోసం తమ పొలాలు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతగా రూ.50 లక్షలు ఇప్పటం గ్రామానికి సాయం ప్రకటించారు. ఈ డబ్బుతో స్ధానికంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలని సూచించారు. అయితే ఆ మొత్తం తమకు ఇవ్వాలని సీఆర్డీయే అధికారులు కోరారు. దానికి ఇప్పటం రైతులు అంగీకరించకపోవడం, ఆ తర్వాత గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో స్ధానికుల ఇళ్లను మున్సిపల్ అధికారులు కూల్చేయడం చకచకా జరిగిపోయాయి. ఇప్పటికీ అక్కడ కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మచిలీపట్నంలో రైతులు ఇప్పటాన్ని మించిన స్ధలం ఇచ్చేందుకు ముందుకు రావడం ఆసక్తికరంగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+