Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పోలీసుల అదుపులో పెద్దిరెడ్డి సొంతఊరు ఉద్యోగి, అంతరాత్రి సబ్ కలెక్టర్ ఆఫీసులో ?

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం విషయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యారు. డీజీపీ తిరుమలరావు మదనపల్లె చేరుకునే ముందే సబ్ కలెక్టర్ కార్యాలయంలో పని చేస్తున్న గౌతమ్ తేజ అలియాస్ గౌతమ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. గౌతమ్ సొంత ఊరు పెద్దిరెడ్డి సొంత నియోజక వర్గం పుంగనూరు కావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రాత్రి 11.24 గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి 10.30 గంటల వరకు కంప్యూటర్ రూమ్ క్లర్క్ గౌతమ్ తేజ అదే కార్యాలయంలో ఉన్నాడు. ఆదివారం సెలవు రోజు అంతరాత్రి వరకు గౌతమ్ సబ్ కలెక్టర్ ఆఫీసులో ఎందుకు ఉన్నాడు, ఆదివారం అతను అక్కడ ఏం చేశాడు అని పిన్ టూ పిన్ తనకు చెప్పాలని సీఎం చంద్రబాబు పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Madanapalle sub collector office employee Gautam Teja is in police custody

మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో కీలక ఫైళ్లు మొత్తం కాలిపోయాయి. ఇదే అగ్నిప్రమాదంలో సీసీటీవీ కెమెరాలు కూడా కాలి బూడిద అయిపోయాయని పోలీసులు అంటున్నారు. కొత్త కలెక్టర్ సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో కొత్త కలెక్టర్ బాధ్యతలు స్వీకరించడానికి సిద్దం అవుతున్న సమయంలో కొన్ని గంటల ముందు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరగడం అనేక అనుమానాలకు దారితీస్తోందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో టార్టాయిస్ కాయిల్, పెట్రోల్ ఉపయోగించి ఎవ్వరికీ అనుమానం రాకుండా నిప్పంటించారని ఆరోపణలు ఉన్నాయి. విద్యుత్ షార్ట్ సర్కూట్ అయి ఉంటే సబ్ కలెక్టర్ కార్యాయలం మొత్తం అంత త్వరగా మంటలు వ్యాపించడానికి అవకాశం లేదని పోలీసులు అంటున్నారు. సబ్ కలెక్టర్ ఆఫీసు వెనుకనే అగ్నిమాపక శాఖ కార్యాలయం ఉంది. సబ్ కలెక్టర్ కార్యాలయానికి, అగ్నిమాపక శాఖ కార్యాలయానికి చిన్న సర్వీస్ రోడ్డు మాత్రం అడ్డం ఉంది.

Madanapalle sub collector office employee Gautam Teja is in police custody
అగ్నిమాపక సిబ్బంది అక్కడే ఉన్నారని, అగ్నిప్రమాదం జరిగిన తరువాత కేవలం రెండు మూడు నిమిషాల్లో వచ్చే అవకాశం ఉందని, అయినా అగ్నిమాపక సిబ్బంది అంత ఆలస్యంగా ఎందుకు వచ్చారు అని పోలీసులు ఆరా తీస్తున్నారు. కలెక్టర్ ఆఫీసు సిబ్బంది అగ్నిప్రమాదం జరిగిన విషయం ఆలస్యంగా అగ్నిమాపక శాఖకు, పోలీసులకు చెప్పారా అని ఆరా తీస్తున్నారు,

అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, ఏఎస్పీ రాజ్ కుమార్ మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గరకు చేరుకుని విచారణ చేపట్టారు. సబ్ కలెక్టర్ ఆఫీసు ఉద్యోగి గౌతమ్ తేజతో పాటు ఇంకా కొంత మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని సమాచారం. మదనపల్లె చేరుకున్న తరువాత వివరాలు తెలుసుకుని తరువాత డీజీపీ తిరుమల రావు సీఎం చంద్రబాబుకు పూర్తి సమాచారం ఇవ్వనున్నారని తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+