కాంగ్రెస్‌కు రాజీనామా, జనసేనలో చేరిన మాదాసు గంగాధరం
అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేత మాదాసు గంగాధరం ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతైంది. ఆ పార్టీకి చెందిన నేతలు ఇతర పార్టీల్లో చేరారు. కొద్దిమంది మాత్రమే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు.
అయితే ఇంత కాలం పాటు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న మాదాసు గంగాధరం శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు. ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ సమక్షంలో గంగాధర్ జనసేన తీర్థం పుచ్చుకొన్నారు.
ఈ మేరకు జనసేన పార్టీ శుక్రవారం నాడు అధికారిక ప్రకటన విడుదల చేసింది. సుదీర్ఘ కాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న గంగాధరం జనసేన పార్టీలోకి రావడం ఆ పార్టీకి కలిసొచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

గంగాధర్ రెండు దఫాలు ఎమ్మెల్సీగా పనిచేశారు.30 ఏళ్ళ నుండి గంగాధరంతో తనకు పరిచయం ఉందని ఆ ప్రకటనలో పవన్ కళ్యాణ్ చెప్పారు. గంగాధరం అనుభవాలు, సలహలు, సూచనలు తమ పార్టీకి ఉపయోగపడుతాయని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు..
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా గంగాధరం కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి శుక్రవారం నాడు రాజీనామా చేశారు. జనసేన ఆవిర్భావ సభ పర్యవేక్షణ బాధ్యతలను గంగాధరంకు అప్పగించినట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications