సెక్యూలర్ జీవులూ! ఇకనైనా మేల్కోకపోతే..: NRCపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌరసత్వ రిజిస్టర్(ఎన్ఆర్సీ)కి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం ద్వారా భారతీయులకూ ఎలాంటి నష్టం లేదని చెబుతున్నప్పటికీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా, నిరసనల నేపథ్యంలో ఎన్నార్సీని ఇప్పుడు అమలు చేయబోమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించడం గమనార్హం.

సోషల్ మీడియా వేదికగా..
ఈ క్రమంలో గుంటూరు నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సినీ నటి మాధవీలత ఫేస్‌బుక్ వేదికగా ఆందోళనలపై ఘాటుగా స్పందించారు. తెలుగు ప్రజల కోసమే తాను ఈ పోస్టును పెడుతున్నట్లు చెప్పిన మాధవీలత.. ఇది ప్రతీ భారతీయుడూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ మేరకు మాధవీలత ఫేస్ బుక్ లో పోస్టు చేసిన వివరాలుఉన్నవి ఉన్నట్లుగా అందిస్తున్నాం..

బెల్జియంలో దాడులు..
‘బెల్జియం దేశాన్ని ఇస్లామిక్ దేశంగా ప్రకటించాలని... చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రహదారులపై వచ్చి చేతికందిన రాళ్ళతో బెల్జియం బెల్జియాస్స పై దాడికి పాల్పడుతున్నారు. ఇప్పటికే యావత్ ప్రపంచంలో ముస్లిమ్స్ మెజారిటీగా ఉన్న దేశాలన్నీ ఇస్లామిక్ దేశాలుగా రూపాంతరం చెందిన విషయం అందరికి తెలిసిందే. అంటే దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్ దేశాలు 67 ఉండగా , ఇప్పుడు ఇంక్కొన్ని కావాలని ఇస్లాం వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి' అని మాధవీలత వ్యాఖ్యానించారు.

సెక్యూలర్ ఆలోచనలతో..
‘ఇందులో భాగంగా ఈజిప్టు ఇప్పటికే ముస్లిమ్స్ లా అనుసరిస్తుండగా , బెల్జియం ప్రజలు గత దశాబ్ద కాలంగా సెక్యులర్ ఆలోచనలతో ...సిరియా నుండి వలసగా వచ్చిన ముస్లిం ప్రజలకు ఆశ్రయం ఇవ్వడంతో ఇప్పుడు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అనుకోని పరిస్థితుల్లో బెల్జియం ప్రజలు తమ అనుకూల ప్రతికూల నాయకులపై విశ్వాసం కోల్పోయి ... మొన్న జరిగిన ఎన్నికల్లో ముస్లిమ్ వ్యక్తిని భారీ మెజారిటీతో గెలిపించడంతో , ఇప్పుడు బెల్జియంలో ముస్లిమ్ నాయకులు పట్టు బిగించారు.
ఇంకేం ఉంటుంది ... దొరికిందే అవకాసం అన్నట్టు ముస్లిమ్ ప్రజలు ధర్నాలు చేయడం ప్రారంబించారు' అని మాధవీలత వివరించారు.

దారుణ పరిస్థితులు..
‘#బెల్జియంలో ఇప్పుడు షరియా కోసం బెల్జియం.com అంటూ ముస్లిమ్ వర్గీయులు ఈ ఉద్యమాన్ని భారీ స్థాయిలో తీసుకొని వెళ్తున్నారు. దీనిపై ఊరు , వాడ ప్రతి చోట ఈ ముస్లిమ్ వర్గీయులు తమ ఉద్యమాన్ని ప్రకటిస్తూ నినాదాలు చేస్తున్నారు. ఒకవేళ ఇస్లామిక్ దేశంగా బెల్జియంని ప్రకటించకపోతే భవిష్యత్‌లో జరగబోయే ప్రతి దాడికి #ప్రభుత్వమే_భాద్యత వహించాలి అంటూ బెల్జియం ముస్లిమ్ లీగల్ పార్టీకి హెచ్చరికలు జారీచేసింది.. పాపం ఇంకేం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో బెల్జియం ప్రజలు పులిహారలో కరివేపాకులా మిగిలిపోయే దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి' అంటూ మాధవీలత వ్యాఖ్యానించారు.

సెక్యూలర్ జీవులు మేల్కొవాలి..
‘ఇప్పటికైనా భారత్ లో ఉన్న సెక్యులర్ జీవులు మేల్కోవాలి. ప్రపంచంలో హిందువుల కోసం ఒకేఒక దేశం ఉంది. అది కేవలం భారతదేశం. గతంలో ప్రపంచమంతా హిందువులే ఉండే వారు. దురదృష్టవశాత్తూ ఈ సెక్యులర్ ఆలోచనల వల్ల అన్ని దేశాలను ముస్లిమ్స్ మరియు క్రిస్టియన్ మతాలకు కట్టబెట్టటం జరిగింది.
ఇప్పుడు ఉన్న ఏకైక దేశాన్ని కూడా హిందువుల దేశం కాదు సెక్యులర్ దేశం అంటూ మనకు మనమే మోసపోతున్నాం' అని మాధవీలత అన్నారు.

మరో బాగ్దాద్ ఎంతో దూరంలో లేదు..
‘మన ఇంటిలో ఒక ఇటుక స్థలం కూడా పక్కోడికి మనం ఇవ్వము అలాంటింది మన దేశాన్ని ఏ అధికారంతో అందరికి కట్టబెట్టుతున్నాం, ఒక సారి ఆలోచించండి
బెల్జియం దేశంలో ముస్లిమ్స్ పార్టీ మొదటి సారిగా గెలిచింది ఆ దేశంలో ఉన్న ముస్లిమ్స్ ఆ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా ప్రకటించాలని ఉద్యమం చేపడుతున్నారు
రేపొద్దున్న మనం కూడా సెక్యులర్ అనే పేరుతో ముస్లిమ్స్ నాయకులకు మన రాజ్యాధికారం ఇస్తే , మన భారతదేశం కూడా బాగ్దాద్ అవ్వడం ఇంకెంతో దూరం లేదు' అని మాధవీలత ఆందోళన వ్యక్తం చేశారు.
మనకూ ఆ గతి తప్పదు..
‘ఇప్పటికే మన దేశంలో ఒవైసీ లాంటి నీచులు 15 నిమిషాలు అవకాశం ఇస్తే హిందువులకు మా దమ్ము చూపిస్తాం అంటూ బహిరంగంగా వ్యాఖ్యానిస్తునారు
ఏ అధికారం లేకుండానే ఇలా ఉంటే, ఒక సారి అధికారం ఇస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అది కూడా ఆలోచించండి. మొన్నటికి మొన్న ఉత్తరప్రదేశ్‌లో కమలేశ్ తివారిని అతి దారుణంగా హత మార్చారు, అందుకు కారణం కమలేశ్ తివారి గతంలో ఒక సారి మొహమ్మద్ ప్రవక్త గురించి ఏదో మాట్లాడారు అని గొంతు కోసి చంపేసారు ఈ ఇస్లామిక్ వర్గీయులు అదే విధంగా ఇప్పటికైనా మన దేశంలో హిందువులు మేల్కొపోతే మనకు కూడా ఆ గతి తప్పదు. మన దేశంలో ఉన్న ఇస్లాములు, వారి సంఖ్య పెంచుకోడానికి మన చుట్టుపక్కల ఇస్లాం దేశాలను నుండి భారీ ఎత్తున శరణార్ధుల పేరిట మన దేశానికి రప్పించుకొని మెజారిటీ లు మారడానికి ఎన్నో దాడులు విధ్వంసాలు చేస్తున్నారు. ప్రతి హిందువుకు నా మనవి: మీ వ్యక్తిగత రాజకీయాలుకు అతీతంగా RSS సిద్దాంతాలకు కట్టుబడి ఉంటే తప్ప భవిష్యత్ మన హిందూదేశంలో హిందువులకు మనుగడ వుండదు' అని బీజేపీ నేత మాధవీలత వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications