సినీ ప్రముఖుల వరుస మరణాలు: కీడు పోవడానికి మృత్యుంజయ హోమం
హైదరాబాద్: ఇటీవల కాలంలో తెలుగు సినిమా పరిశ్రమలో వరుసగా సినీ ప్రముఖులు చనిపోవడంతో, కీడు పోవడానికి హైదరాబాద్ ఫిలింనగర్ దైవసన్నిధానంలో మహా మృత్యుంజయ హోమం చేపట్టారు.
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో ఈ హోమం నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు (మార్చి 23 నుంచి 25 వరకు) ఈ మహా హోమం జరగనుందని మా అధ్యక్షలు, ఎంపీ మురళీ మోహన్ తెలిపారు.

ఈ మృత్యుంజయ హోమం కార్యక్రమానికి చైర్మన్ మురళీ మోహన్‌తో పాటు రాఘవేంద్రరావు, పరుచూరి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. గత ఏడాదిన్నర కాలం నుంచి పలువురు సినీ ప్రముఖులు మరణించిన సంగతి తెలిసిందే. మరణించిన వారిలో శ్రీహరి, ఉదయ్ కిరణ్, రామానాయుడు, ఏవీఎస్, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రమణ్యం ఉన్నారు.












Click it and Unblock the Notifications