జగన్ ను నమ్మి చంద్రబాబును అపార్ధం చేసుకున్నా- మహాసేన రాజేష్ కామెంట్స్- టీడీపీలో చేరిక

2019 ఎన్నికల్లో వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన మహాసేన రాజేష్ ఇవాళ తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా తాను వైఖరి అందుకు మార్చుకోవాల్సి వచ్చిందో వివరించారు.

దళిత నేత మహాసేన రాజేష్ ఇవాళ తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.అధినేత చంద్రబాబు కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సామర్లకోటలో దళిత సామాజిక వర్గంతో నిర్వహించిన సమావేశంలో చేరికల కార్యక్రమం కూడా నిర్వహించారు.

2019లో వైసీపీకి మద్దతిచ్చి జగన్ విజయానికి కృషిచేసిన తాను.. ఇప్పుడు టీడీపీలో చేరాల్సి రావడంపై మహాసేన రాజేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2019లో చంద్రబాబును వ్యతిరేకించడంపై రాజేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.2019 ఎన్నికలకు ముందు చంద్రబాబును తాము వ్యతిరేకించామని.. ఆయన్ను దళిత ద్రోహిగా జగన్‌ చిత్రీకరించారన్నారు. జగన్‌ మాటలు విని చంద్రబాబును అపార్థం చేసుకున్నామని.. అయితే నిజమైన దళిత ద్రోహి ఎవరో తెలుసుకోగలిగామన్నారు.

mahasena rajesh joins tdp-compares jagan with chandrababu-reveal bitter past after 2019

టీడీపీకి 40 ఏళ్ల చరిత్ర ఉందని, 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబును విలన్‌లా చూపించారని రాజేష్ చెప్పుకొచ్చారు. దళితులకు ద్రోహం చేశారని, బాబాయిని చంద్రబాబు చంపించారని నమ్మించారని, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయన్నారు. చంద్రబాబును అపార్థం చేసుకున్నామని, జగన్ గెలుపు కోసం పనిచేసామని, కానీ ఆ తర్వాత అసలు నిజాలు తెలిశాయన్నారు. దళితుడ్ని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తులకు సన్మానం చేసిన వ్యక్తుల్ని చూశామని, దళితులకు జరుగుతున్న అన్యాయం గురించి తెలుసుకోగలిగామన్నారు.
దళితులు ఎవరి కాళ్లమీద వారు నిలబడేలా చంద్రబాబు చేశారన్నారు.

mahasena rajesh joins tdp-compares jagan with chandrababu-reveal bitter past after 2019

దళితులకు 27 సంక్షేమ పథకాలను అమలు చేస్తే.. జగన్ ప్రభుత్వం రాగానే వాటిని రద్దు చేశారని మహాసేన రాజేష్ విమర్శించారు. 2019లో తప్పు చేయకుండా ఉండుంటే అమరావతి నిర్మాణం పూర్తయ్యేదని, చీకటి వచ్చాకే వెలుగు విలువ తెలుస్తుంది అన్నారు. అమరావతి భవనాలను చూసి ఇడ్లీ పాత్రలని వెటకారం చేశారని, ఇప్పుడు వాళ్లు హైదరాబాద్ లో ఇడ్లీలు అమ్ముకుంటున్నారన్నారు. చంద్రబాబు పాలనలో దళితులు ఇన్నోవా కార్లకు ఓనర్లయ్యారన్నారు. గతంలో చంద్రబాబు రాష్ట్రం కష్టాల్లో ఉంది ఓ గంట అదనంగా పనిచేయమని అడిగితే విమర్శించారు. ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు కూడా రావడం లేదన్నారు.

చంద్రబాబు గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత టీడీపీలో చేరామని, దళితులకు చంద్రబాబు అన్యాయం చేశారని అంటున్నారని, దళితులకు చంద్రబాబు ఏం చేశారో, జగన్ ఏం చేశారో చర్చకు సిద్ధమా అని రాజేష్ సవాల్ చేశారు. చంద్రబాబుకు ఎస్సీలంటే చిన్న చూపు ఉంటే మరి బాలయోగిని లోక్‌సభ స్పీకర్ ఎలా చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు రాష్ట్రం కోసం లోకేష్‌ను పాదయాత్రకు పంపించారని, ఈ వయసులో చంద్రబాబు ఎన్నో అవమానాలు పడుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామానికి వెళతాం, ప్రతీ దళిత కుటుంబాన్ని కలుస్తామని.. చంద్రబాబును సీఎంను చేయడమే తమ లక్ష్యం అన్నారు. చంద్రబాబు 2019లో గెలిచి ఉంటే రాష్ట్రం ఎంతో ముందుకు వెళ్లేదని, ఆ తప్పు మళ్లీ జరగకుండా చూస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+