అన్నా.. వెకేషన్ లో సినిమానా? సినిమా మధ్యలో వెకేషనా?
ఏ ముహూర్తాన ఈ సినిమాను ప్రారంభించారో కానీ అప్పటి నుంచి ఏ చిత్రానికి ఎదురవనన్ని అడ్డంకులు గుంటూరు కారం చిత్రానికి ఎదురవుతున్నాయి. ఒకరికి కుదిరితే మరొకరికి కుదరదు. ఒకరి కాల్షీట్లు అందుబాటులో ఉంటే మరొకరి కాల్షీట్లు అందుబాటులో ఉండవు. త్రివిక్రమ్ శ్రీనివాస్ బ్రో చిత్రానికి రచయితగా పనిచేయడంవల్లే ఈ సమస్యలన్నీ తలెత్తాయి. షూటింగ్ ప్రారంభిద్దామనుకునే సమయానికి అప్పటికే కాల్షీట్లిచ్చిన సీనియర్ నటులవి అందుబాటులో లేకుండా పోయాయి.
ముందుగా మహేష్ బాబు తల్లి మరణించారు. తర్వాత తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణించారు. స్క్రిప్ట్ లో మార్పులు జరిగాయి.. హీరోయిన్ గా పూజా హెగ్డే తప్పుకోగా ఆమె స్థానంలో మీనాక్షి చౌదరి వచ్చింది.. ఇలా ఏదో ఒక కారణంచేత ఈ సినిమా వాయిదా పడుతూనే వస్తోంది. 2024 సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. అప్పటికి సినిమా పూర్తవుతుందనే నమ్మకాన్ని మహేష్ బాబు అభిమానులు వ్యక్తపరచలేకపోతున్నారు. తాజాగా ప్రిన్స్ ఈ సినిమా షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ పూర్తి చేసిన మహేష్ బాబు జులై 20వ తేదీన తన కుమార్తె సితార పుట్టినరోజు ఉండటంతో కుటుంబ సభ్యులనందరినీ తీసుకొని దుబాయ్ పయనమైనట్లు తెలుస్తోంది.

షూటింగ్ కు ఎటువంటి విరామం ఇవ్వకుండా పూర్తిచేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారు. మహేష్ అభిమానులు మాత్రం అన్నా వెకేషన్లో సినిమా చేస్తున్నావా? లేదంటే సినిమా మధ్యలో వెకేషనా? అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కొందరు మాత్రం కుమార్తె పుట్టినరోజు వేడుకలు మహేష్ బాబైనా జరుపుకోవద్దా? అంటూ అతనికి మద్దతు పలుకుతున్నారు.












Click it and Unblock the Notifications