నంద్యాల దెబ్బ, కొత్త కోణం: పవన్ కళ్యాణ్‌పై మహేష్ కత్తి రెచ్చిపోవడం వెనుక?

Posted By:
Subscribe to Oneindia Telugu
  పవన్ కళ్యాణ్‌పై మహేష్ కత్తి రెచ్చిపోవడం వెనుక ఉన్నది ఆయనా? YS Jagan Behind Mahesh Kathi | Oneindia

  అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై కత్తి మహేష్ రెచ్చిపోవడం వెనుక కారణం ఏమిటనే చర్చ ఇప్పుడు సినిమా పరిశ్రమలోనే కాదు. రాజకీయ పార్టీల్లోను చర్చ సాగుతోంది.

  చదవండి: లక్షలమంది పుడతారు, తెలుసుకోకుండా హిందుత్వశక్తులు అనడం సరికాదు: గౌరీ లంకేష్ హత్యపై పవన్ కళ్యాణ్

  జగన్‌కు నంద్యాల దెబ్బ

  జగన్‌కు నంద్యాల దెబ్బ

  నంద్యాల ఉప ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పరోక్షంగా టిడిపికి మద్దతు పలికారని వైసిపి, ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కత్తి మహేష్ ద్వారా పవన్ కళ్యాణ్‌కు చెక్ చెప్పేందుకు జగన్ పావులు కదుపుతున్నారని అంటున్నారు.

  విమర్శకులు అంటే.. రాజకీయ కోణంలోను

  విమర్శకులు అంటే.. రాజకీయ కోణంలోను

  సాధారణంగా విమర్శకుడు అంటే కొంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని, కానీ కత్తి మహేష్ తీరు చూస్తుంటే ఆ క్వాలిటీ కనిపించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెచ్చిపోతే.. ప్రతిగా ఈయన కూడా రెచ్చిపోవడం ఏమిటని అంటున్నారు. అందుకే పవన్ పైన మహేష్ కత్తి విమర్శలను కొందరు రాజకీయ కోణంలోను ఆలోచన చేస్తున్నారు.

  కొత్త కోణం

  కొత్త కోణం

  చంద్రబాబు - పవన్ కళ్యాణ్ మధ్య 2019 నాటికి దూరం పెరుగుతుందని వైసిపి భావించింది. కానీ అది జరిగేలా కనిపించడం లేదని తాజా పరిణామాలను చూస్తుంటే అర్థమవుతోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో కత్తి మహేష్‌ను ఉపయోగించుకొని జగన్.. పవన్ కళ్యాణ్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే కొత్త వాదన తెరపైకి వచ్చింది.

  అందుకు కత్తిని వాడుకుంటున్నారని

  అందుకు కత్తిని వాడుకుంటున్నారని

  త్వరలో జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో సమయం కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలో జనసేన భవిష్యత్తును నాశనం చేసేందుకు, పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తును గందరగోళపరిచేందుకు, జనాల్లో జనసైన్యాన్ని విద్రోహ శక్తులుగా చిత్రీకరించేందుకు జగన్.. కత్తి మహేష్‌ను వాడుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

  పవన్ కళ్యాణ్‌కు చెక్ చెప్పే కుట్ర, వైసిపి వైపు కత్తి

  పవన్ కళ్యాణ్‌కు చెక్ చెప్పే కుట్ర, వైసిపి వైపు కత్తి

  మహేష్ కత్తి వరుస విమర్శలు చూస్తుంటే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్, జనసేనను తొక్కేసేందుకే రాజకీయంగా కుట్ర జరుగుతోందనే ప్రచారం సాగుతోంది. అంతేకాదు, కత్తి రాజకీయాల్లో అడుగు పెట్టే అవకాశాలు లేకపోలేదని, వైసిపిలో చేరవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Tollywood personolity Mahesh Kathi is critisicing Jana Sena chief Pawan Kalyan. It is said that YSR Congress Party chief YS Jaganmohan Reddy behind Mahesh Kathi.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి