జనసేన ప్రెస్ నోట్ వెనుక!: పవన్ తొలి సినిమా నుంచి సీక్రెట్స్ చెప్పనా: మహేష్ కత్తి ఇంకా
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అభిమానులు, మహేష్ కత్తికి మధ్య వాగ్వాదం జరుగుతోంది. శుక్రవారం మహేష్ కత్తి ఓ టీవీ ఛానల్ డిబేట్‌లో పాల్గొన్నారు. నటుడు, నిర్మాత రాంకీ, కోటీ తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన ప్రెస్ నోట్ విడుదల చేసినప్పటికీ మహేష్ కత్తి తగ్గలేదు. పైగా, పవన్ కళ్యాణ్ తనకు సారీ చెప్పేవరకు ఊరుకునేది లేదన్నారు. మహేష్ కత్తి మూర్ఖంగా వ్యవహరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
చదవండి: పోర్న్‌స్టార్‌కే: పూనమ్ కౌర్ మళ్లీ సంచలన ట్వీట్, మహేష్ కత్తికి దిమ్మతిరిగే షాక్!
Recommended Video

మరోవైపు, మహేష్ కత్తి పదేపదే విమర్శలు చేస్తుండటం, అభిమానులు ఆయనకు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తుండటంతో.. పార్టీకి నష్టం రాకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా జనసేన నష్టనివారణ చర్యలు చేపట్టిందని అంటున్నారు. మహేష్ కత్తి లాంటి వారు ఇమేజ్ దెబ్బతీసే ప్రయత్నాలు చేసినా మనం మౌనంగా ఉండాలని జనసేన పేర్కొంది. ఇప్పటికే మహేష్ కత్తి తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు జనసేన ప్రెస్ నోట్ ఇచ్చినా తగ్గకపోవడంతో ఆయనపై అనుమానాలు బలపడుతున్నాయని అంటున్నారు.
చదవండి: చిరంజీవికి అలా చెప్పి ఎక్కడ దాక్కున్నావ్: రేణుని లాగి పవన్‌పై మహేష్ కత్తి, దుమ్ముదులిపిన రాంకీ

ఇలాగేనా మాట్లాడేది
ఓ టీవీ ఛానల్ డిబేట్‌లో నటుడు - నిర్మాత రాంకీ, మహేష్ కత్తిల మధ్య వాగ్వాదం జరిగింది. పవన్‌పై ఇష్టారీతిన విమర్శలు సరికాదని, పెళ్లాన్ని కాపాడుకోలేని వాడు రాష్ట్రాన్ని ఏం కాపాడుతాడని ప్రశ్నించిన కత్తి.. అమ్మాయిలతో అనుచితంగా ప్రవర్తిస్తుంటే ఆయనకు స్త్రీలపై ఉండే గౌరవం ఇదేనా అన్నారు.

పవన్ కళ్యాణ్ అపైర్స్ చెబుతా
దీనిపై మహేష్ కత్తి స్పందిస్తూ.. ఇదేం నైతికత అంటూ ప్రశ్నించే హక్కు లేదని చెప్పడం ఏమిటని, అదే ఆధారమైతే పవన్ కళ్యాణ్ అపైర్స్ అన్నీ చెబుతానని, అసలు అలాంటి పవన్‌తో నేనేం మాట్లాడుతానని నేనూ అంటానని, కానీ అది విషయం కాదన్నారు. అయితే పవన్ వ్యక్తిగత విషయాలు తీశాకే మహేష్ కత్తి వ్యక్తిగత విషయాలు వచ్చాయనేది అందరి వాదన.

నేను తాగుబోతును, తిరుగుబోతును కాబట్టి ప్రశ్నించొద్దా
చర్చించేందుకు ముందుకు వస్తే పవన్ కళ్యాణ్ ఫాం హౌస్ సీక్రెట్స్ కూడా బయటపెడతానని మహేష్ కత్తి అనుచిత వ్యాఖ్యలు చేశారు. నేను తాగుబోతు, తిరుగుబోతు కాబట్టి పవన్‌ను ప్రశ్నించవద్దా అని అన్నారు. అదే అయితే పవన్ అఫైర్స్ మాటేమిటని అడిగారు. నిర్మాతలను మోసం చేశాడని, ఆయనకు ఎంతమందితో అఫైర్ ఉందో చెబుతానని సవాల్ విసిరారు.

పవన్ మొదటి సినిమా నుంచి, అన్నీ చెప్పేస్తా
పవన్ కళ్యాణ్ మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు ఆయనకు తెలిసిన వ్యక్తితోనే మాట్లాడిస్తానని, అన్నీ మాట్లాడుతామని మహేష్ కత్తి అన్నారు. తాను చెప్పే విషయాల్లో ఒక్కటి కాదని చెప్పాలని అన్నారు. నేను ఎవరో అమ్మాయికి మెసేజ్ పెట్టినట్లుగా రాంకీ చెబుతున్నారని, ఆ అమ్మాయిని తీసుకు రాగలరా అని ప్రశ్నించారు.

పవన్ వ్యవహారాలు బయటపెడతా
నాకు క్రెడిబిలిటీ లేదని నిరూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, అదే నిజమైతే తాను పవన్ వ్యవహారాలు బయటపెడతానని మహేష్ కత్తి అన్నారు. త్రివిక్రమ్ లైన్లోకి వస్తే అన్నీ బయటపెడతానని, పవన్ మనిషి కాది నిరూపిస్తానని చెప్పారు. దీనిపై రాంకీ మాట్లాడుతూ.. వివాదం సమసిపోయేందుకు తాను ప్రయత్నించానని, కానీ మనం ఒకలా మాట్లాడితే కత్తి మరొకలా మాట్లాడుతారని తనకు తెలుసునని అన్నారు. అది తన అజెండా కాదన్నారు.

పవన్ క్రెడిబిలిటీ దెబ్బతీసే ప్రయత్నాలు
ఇదిలా ఉండగా, తన పైన జనసేన పైన ఇష్టారీతిన ఆరోపణలు చేస్తున్నారని, కుట్రపూరితంగానే జరుగుతోందని, తనపై వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తారని పవన్ చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు మహేష్ కత్తి డిబెట్‌లో అదే రకంగా మాట్లాడారు. తొలుత మహేష్ కత్తియే పవన్ వ్యక్తిగత అంశాలు తీశారు. దీనిని బట్టి రాజకీయాల్లోకి పూర్తిగా రావడానికి ముందు పవన్ క్రెడిబిలిటీ దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అర్థమవుతోందని అంటున్నారు. ఇది ఒకవిధంగా ఊహించని పరిణామం అని చెప్పవచ్చు












Click it and Unblock the Notifications