Mahesh Babu : విజయవాడకు మహేష్ బాబు- కృష్ణానదిలో సూపర్ స్టార్ కృష్ణ అస్తికల నిమజ్జనం..
గత వారం తుదిశ్వాస విడిచిన దివంగత సూపర్ స్టార్ కృష్ణ అస్తికలను కృష్ణానదిలో నిమజ్జనం చేయనున్నారు. కృష్ణ కుటుంబ సభ్యులు ఆయన అస్తికల్ని కృష్ణానదితో పాటు మిగతా నదుల్లోనూ నిమజ్జనం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ముందుగా ఇవాళ కృష్ణానదిలో ఆయన అస్తికలు నిమజ్జనం చేయనున్నారు.
విజయవాడ వద్ద కృష్ణానదిలో సూపర్ స్టార్ కృష్ణ అస్తికల్ని కుటుంబ సభ్యులు నిమజ్జనం చేస్తున్నారు. దీనికోసం కృష్ణ తనయుడు మహేష్ బాబుతో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఈ ఉదయం విజయవాడ వచ్చారు. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న కృష్ణ కుటుంబసభ్యులు.. అనంతరం రోడ్డు మార్గంలో విజయవాడ చేరుకున్నారు. అక్కడి నుంచి కృష్ణానది ఘాట్ కు వెళ్లి అక్కడ అస్తికలు నిమజ్జనం చేయబోతున్నారు. ఇందుకోసం స్దానికంగా కొందరి సాయంతో ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

మహేష్ బాబుతో పాటు కృష్ణ కుటుంబం రాక సందర్భంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. మహేశ్ కు ఉన్న ఫాన్ ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని అభిమానుల రద్దీని నియంత్రించేందుకు కృష్ణా ఘాట్ లో కూడా ఆంక్షలు విధించి భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. తద్వారా మహేష్ బాబుతో పాటు కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ టూర్ పూర్తిచేసుకుని వెళ్లేలా చూస్తున్నారు. ఇవాళ మహేష్ బాబుతో కలసి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న వారిలో ఆయన బావ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, మహేష్ బాబు బాబాయ్ శేషగిరిరావు, నాగ సుధీర్, సూర్య, త్రివిక్రమ్ ఉన్నారు.
Mahesh Babu Reached Gannavaram Airport. pic.twitter.com/XsUzSew2Cx
— Naveen MB Vizag (@NaveenMBVizag) November 21, 2022












Click it and Unblock the Notifications