పెట్రోల్ పోసి భార్య, కొడుకు, అత్తలకు నిప్పంటించాడు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో దారుణ సంఘటన జరిగింది. పెట్రోల్ పోసి భార్య, కుమారుడు, అత్తలకు ఓ వ్యక్తి నిప్పంటించాడు. ఈ సంఘటన విజయవాడలోని చిట్టీ నగర్‌లో శనివారం ఉదయం చోటు చేసుకుంది.
గుంటూరు జిల్లా ఎర్రబాలెంకు చెందిన రాజేంద్రప్రసాద్‌కు మూడేళ్ల క్రితం చిట్టీనగర్‌కు చెందిన ఆకుల రోజాతో వివాహమైంది. వీరికి 9 నెలల కుమారుడు ఉన్నాడు. అయితే, కుటుంబ కలహాల కారణంగా రాజేంద్ర ప్రసాద్ భార్యకు దూరంగా ఉంటున్నాడు.

ఈ క్రమంలోనే అతను శనివారం ఉదయం భార్య పుట్టింటికి వెళ్లి గొడవ పడ్డాడు. ఈ సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. పర్సపరం దుర్భాషలాడుకున్నారు. ఈ సమయంలో రాజేంద్ర ప్రసాద్ కోపంతో సహనం కోల్పోయి దారుణానికి పాల్పడ్డాడు.
భార్యపై, కుమారుడిపై, అడ్డు వచ్చిన అత్తపై పెట్రోల్ పోసి, నిప్పంటించాడు. ఇది గమనించిన స్థానికులు అడ్డుకోవడంతో రాజేంద్ర ప్రసాద్ పారిపోయాడు. బాధితులను ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications