అఫైర్, కక్షలు: దంపతుల కళ్లలో కారం, భర్త హత్య

భయాందోళనలతో దంపతులు అక్కడి నుంచి పరుగెత్తారు. దుండగులు భర్తను వెంటాడి కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనకు పాత కక్షులు, వివాహేతర సంబంధం కారణాలని అనుమానిస్తున్నారు. జన్నారం ఎస్సై బుద్దేస్వామి సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
వరంగల్ జిల్లాలో దొంగల బీభత్సం
వరంగల్ జిల్లాలోని రఘునాథపల్లిలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇంట్లోకి చొరబడి దుండగులు దోపిడీకి యత్నింారు ఇంట్లో వారు ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో వారిపై కత్తులో దాడి చేసి నగదు, నగలను అపహరించారు. దుండగుల దాడిలో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురు కత్తిపోట్లకు గురయ్యారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.
మృతులు లక్ష్మి(50), అఖిల(10)గా గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దొంగల బీభత్సంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.












Click it and Unblock the Notifications