ప్లాస్టిక్ గోతాల కింద శవం: హత్యకు దారి తీసిన అక్రమ సంబంధం
నెల్లూరు: వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలను తీసింది. అంతేకాకుండా భార్యను, ఇద్దరు పిల్లలను అనాథలను చేసింది. ఒక వివాహితతో పెట్టుకున్న సంబంధం అతని హత్యకు కారణమైంది. ఆదివారం వినుకొండ కొండమెట్ల బజారులో ఓ ఇంటి ఖాళీ స్థలంలో మట్టి పోసి ప్లాస్టిక్ గోతాల కింద వెలుగు చూసిన మృత దేహం ఆచూకీని పోలీసులు కనిపెట్టారు.
ఈపూరుకు చెందిన ఆటో డ్రైవర్ మొగలి హనుమంతరావు(35)గా గుర్తించారు. ఈపూరు గ్రామానికి చెందిన లాజరు, ఆదెమ్మల కూతురు రాణికి శావల్యాపురం వేల్పూరు గ్రామానికి చెందిన మొగలి హనుమంతరావుతో 2004లో వివాహం జరిగింది. పెళ్ళి అయిన తర్వాతి నుంచి హనుమంతురావు కూడా ఈపూరు వచ్చి ఉంటున్నాడు. ఆటో నడుపుకొంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
గత రెండు సంవత్సరాలుగా అంగలూరు గ్రామానికి చెందిన ఒక వివాహితతో సంబంధం పెట్టుకొని ఆమెతో కలిసి వినుకొండలో సహజీవనం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో రాణి రెండు సార్లు వినుకొండ వెళ్ళి ఈపూరులోని ఇంటికి రమ్మని పిలిచినా హనుమంతరావు అంగీకరించలేదని బంధువులు చెబుతున్నారు.

ఈ క్రమంలో హనుమంతరావు గుంటూరులో తనకున్న స్థలాన్ని విక్రయించాడు. వచ్చిన డబ్బుల్లో కొంత అప్పులు తీర్చాడు. మిగిలిన డబ్బులను భార్యకు వెళ్తాయనే ఆలోచనతో డబ్బు కోసమే హనుమంతరావును హత్య చేసి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు.
వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళే హత్య చేయించి ఉంటుందని, అందుకే ఆమె కనిపించకుండా పోయిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హనుమంతరావు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు వినుకొండ సీఐ జి. శ్రీనివాసరావు తెలిపారు.












Click it and Unblock the Notifications