విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గొంతు కొరికి భార్యను చంపిన భర్త, విద్యార్థి ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

 Man kills wife in Chittoor district
చిత్తూరు/ విజయవాడ: చిత్తూరు జిల్లాలో ఓ వ్యక్తి అత్యంత దారుణంగా వ్యవహరించాడు. గొంతు కొరికి భార్యను ఓ భర్త అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలివారిపల్లెలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు - మొగిలివారిపల్లె మాదిగవాడకు చెందిన పి.బాలాజీకి వేపనపల్లె మాదిగవాడకు చెందిన సి.బాలాజీ కుమార్తె శోభకు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది.

అయితే వీరికి సంతానం కలుగలేదు. ఈ నేపధ్యంలో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని రోజూ భర్తను నిలదీసేది. బాలాజీ చిత్తూరు ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఈ నేపధ్యంలో కుటుంబ కలహాలు ఎక్కువయ్యాయి. బుధవారం ఇంటికి వచ్చిన భర్తతో వాదనకు దిగడంతో కోపోద్రిక్తుడైన ఆయన భార్య శోభ గొంతు కొరికి హత్య చేసినట్లు తెలిపారు. అత్త పెద్దపాప, మామ దొరస్వామి, మరిది మురళిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరిప్రసాద్ తెలిపారు.

ఇదిలావుంటే, విజయవాడలోని నారాయణ కళాశాల హాస్టల్‌లో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర విద్యార్థి ఒకరు సహచర విద్యార్థుల వేధింపులు తాళలేక హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. స్నేహితులు వేధిస్తున్నారని, తట్టుకోలేక చనిపోతున్నానంటూ ఆ విద్యార్థి రాసిన లేఖ మృతదేహం వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నందిగామకు చెందిన చిత్తజల్లు రమేష్‌బాబు కుమారుడు విజయకృష్ణ స్వరూప్ (16) గొల్లపూడిలోని నారాయణ కళాశాలలో ఎంపిసిలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. గతరాత్రి తన గదిలో నిద్రకు ఉపక్రమించిన స్వరూప్ బుధవారం ఉదయం విగతజీవిగా మారడంతో అనుమానించిన తోటి విద్యార్థులు కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు.

అప్పటికే చనిపోయి ఉండటాన్ని గమనించి పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతుని నోటి వెంట నురుగులు వచ్చిన ఆనవాళ్లను బట్టి పురుగుమందు తాగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

English summary
A person has killed his wife biting neck in Chittoor district. Meanwhile a student commited suicide at Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X