వంద రూపాయల కోసం భార్యను చంపేసి, కాల్చేశాడు

 Man kills wife for rupees hundred
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. వంద రూపాయల కోసం గొడవకు దిగి ఓ వ్యక్తి ఉరివేసి ఆ తర్వాత కిరోసిన్ పోసి భార్యను తగులబెట్టాడు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం అక్కన్నపేటలో ఈ ఘటన జరిగింది.

వరంగల్ జిల్లా మద్దూరు మండలం ధూళిమిట్టకు చెందిన కొండూరి శ్రీనివాస్‌కు తన మేనమరదలు హుస్నాబాద్ మండలం అక్కన్నపేటకు చెందిన రేణుకతో ఏడేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి నాగచైతన్య (6) అనే కుమారుడున్నాడు. హైదరాబాద్‌లో ఉంటూ కూలీ పనులు చేసుకునేవారు.

నాలుగేళ్ల క్రితం పుట్టిల్లయిన అక్కన్నపేటకు వచ్చి ఉంటున్నారు. శ్రీనివాస్ ఏ పనీ చేయకుండా భార్య కూలి పనిచేసి తీసుకువచ్చే డబ్బులతోనే మద్యం తాగి, ఆమెను వేధించేవాడు. మంగళవారం రాత్రి వంద రూపాయల విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.

కుటుంబసభ్యులు ఓ గదిలో కిరోసిన్ పోసి నిప్పంటించి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. పొగలు రావడంతో చుట్టుపక్కలవాళ్లు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే రేణుక మరణించింది. గ్రామస్తుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+