అన్న కూతుర్నే చెరబట్టిన బాబాయ్.. గర్భవతిని చేసి ఆపై..
సమాజంలో రోజు రోజుకి మానవ సంబంధాలు మృగ్యం అయిపోతున్నాయి. వావివరుసలు మరచి చిన్నపిల్లలని కూడా చూడకుండా అత్యాచారాలకు పాల్పడుతున్న వారు పెరిగిపోతున్నారు . తాజాగా సొంత అన్న కూతుర్ని బాబాయ్ లైంగిక వేధింపులకు గురిచేస్తూ గర్భవతిని చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని నీళ్ల కుంట గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి భార్యా పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. అయితే నాగరాజు భార్య మళ్లీ గర్భవతి కావడంతో తన కామం తీర్చుకోవడానికి అన్న కూతురు పై కన్నేసిన బాబాయ్ రోజు స్కూల్ కి తీసుకు వెళ్లడం, తీసుకురావడం చేసేవాడు. బాలిక కు ఇష్టమైన చిరుతిళ్లు కొనిచ్చి ఇంటిదగ్గర వదిలిపెట్టేవాడు.

అయితే ఒకరోజు బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆపై ఎవరికైనా చెబితే అమ్మానాన్నలను చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాలిక ఎవరికైనా చెప్తే అమ్మ నాన్నలను చంపేస్తారేమో అని భయపడి ఎవరికీ చెప్పకుండా లోలోపల కుమిలిపోయింది. ఇదే అదునుగా బాలికపై తరచుగా లైంగిక దాడికి పాల్పడుతున్న బాబాయ్ స్కూల్ నుంచి ఇంటికి తీసుకు వచ్చేటప్పుడు బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్లి లైంగిక దాడి చేసేవాడు.
దీంతో బాలిక గర్భం ధరించింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో బాలిక ఎవరికీ చెప్పలేదు. క్రమంగా బాలిక శరీరంలో మార్పులు గమనించిన తల్లి బాలికను ఆసుపత్రికి తీసుకువెళ్ళి చూపించగా, బాలిక ఎనిమిది నెలల గర్భవతి అని డాక్టర్లు చెప్పారు. దీంతో ఒక్కసారిగా తల్లి షాక్ అయింది. ఆపై తల్లిదండ్రులు బాలికలు కూర్చోబెట్టి అడగగా అప్పుడు బాలిక జరిగిందంతా తల్లిదండ్రులకు చెప్పింది.
దీంతో నిందితున్ని పట్టుకొని దేహశుద్ధి చేసి అనంతరం పోలీసులకు అప్పగించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ కు తరలించారు. గతంలో కూడా నిందితుడు గ్రామంలోని పలువురు మహిళలు, బాలికలు పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు, అతని పై కేసులు కూడా నమోదు అయినట్టు సమాచారం.












Click it and Unblock the Notifications