ఎన్నికల బరిలోకి భూమా మౌనిక - మంచు మనోజ్ క్లారిటీ..!?

భూమా మౌనిక వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆసక్తిగా ఉన్నారు. దీని పై మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చారు.

భూమా మౌనిక - మంచు మనోజ్ కొత్త జీవితం ప్రారంభించారు. వివాహం తరువాత ఆళ్లగడ్డ చేరుకున్న ఈ ఇద్దరు తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఇరు కుటుంబాల నుంచి వీరిద్దరికీ ఆశీర్వాదాలు అందాయి. ఇదే సమయంలో రాజకీయంగానూ వీరి కొత్త పాత్ర పైన చర్చ మొదలైంది. భూమా కుటుంబం నుంచి అఖిల గతంలో ఎమ్మెల్యేగా.. టీడీపీలోకి ఫిరాయించి మంత్రిగా పని చేసారు. అక్కకు మౌనిక మద్దతుగా నిలిచారు. నంద్యాల ఉప ఎన్నికల్లోనూ తమ సోదరుడు గెలుపు కోసం పని చేసారు. వచ్చే ఎన్నికల్లో మౌనిక పోటీ చేయాలని ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీని పైన మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చారు.

ఆళ్లగడ్డ నుంచి మౌనిక బరిలో నిలుస్తారా

ఆళ్లగడ్డ నుంచి మౌనిక బరిలో నిలుస్తారా


భూమా శోభా నాగిరెడ్డి.. నాగిరెడ్డి మరణం తరువాత అఖిల రాజకీయంగా యాక్టివ్ గా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల కోసం సిద్దం అవుతున్నారు. ఆళ్లగడ్డ లో తిరిగి అఖిల పోటీ చేస్తారని చెబుతున్నారు. గతంలో అక్క అఖిలకు మద్దతుగా నిలిచిన మౌనిక ఇప్పుడు తాను కూడా రాజకీయంగా ఎన్నికల బరిలో దిగాలని కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు మనోజ్ తో వివాహం.. టీడీపీ - వైసీపీ రెండు పార్టీలతో ఇద్దరికీ సత్సంబంధాల నమడు రాజకీయగా ఏం చేయబోతున్నారనే చర్చ మొదలైంది. వైసీపీ నుంచి ఆళ్లగడ్డ, నంద్యాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీ నుంచి సొంత అక్క ఆళ్లగడ్డ నుంచి పోటీకి సిద్దంగా ఉన్నారు. దీంతో..మౌనిక రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకుంటారనేది భూమా అనుచరుల్లో ఆసక్తి పెంచుతోంది.

క్లారిటీ ఇచ్చిన మంచు మనోజ్

క్లారిటీ ఇచ్చిన మంచు మనోజ్


తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తరువాత మంచు మనోజ్ మీడియాతో కీలక వ్యాఖ్యలు చేసారు. రాజకీయాల పైన స్పష్టత ఇచ్చారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. కానీ, ప్రజా సేవ చేయాలనే కోరిక మాత్రం ఉందన్నారు. మౌనిక రాజకీయాల్లోకి వస్తే మాత్రం తాను మద్దతు ఇస్తానంటూ అసలు విషయం చెప్పారు. ప్రేమ ఎప్పుడూ గెలవాలని..తన విషయంలో అది నిజమైందని మనోజ్ చెప్పుకొచ్చారు. తాను 12 సంవత్సరాలు ప్రేమలో ఉన్నానని..ఆరు ఏళ్లు కష్టాలు అనుభవించానని చెప్పుకొచ్చారు. ఎక్కడ ఆగానో..తిరిగి అక్కడ నుంచే మొదలు పెడుతున్నానంటూ త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని మనోజ్ చెప్పారు. అదే సమయంలో మౌనిక రాజకీయ ఎంటీకి మనోజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. తన మద్దతు కూడా ఉంటుందని స్పష్టం చేసారు.

టీడీపీ లోనేనా..వైసీపీ వైపా

టీడీపీ లోనేనా..వైసీపీ వైపా


భూమా మౌనిక ఇక రాజకీయంగా ఎంట్రీ ఇవ్వటం లాంఛనంగానే కనిపిస్తోందని భూమా అనుచరులు చెబుతున్నారు. అయితే, ఏ పార్టీ నుంచి అనేది మాత్రం తేలాల్సి ఉందంటున్నారు. అక్క అఖిలతో కలిసి టీడీపీలో పని చేసిన అనుభవం ఉంది. అదే విధంగా వైసీపీతో బంధుత్వం ఉంది. మామ బీవీ మోహన్ రెడ్డి ఇప్పటికే వైసీపీలో ఉన్నారు. విజయమ్మ మద్దతు ఉంది. తల్లి శోభా జీవించి ఉన్న సమయంలో శోభా - నాగిరెడ్డి ఇద్దరూ వైసీపీలోనే ఉన్నారు. శోభ మరణం తరువాత నాగిరెడ్డి తన కుమార్తెతో కలిసి వైసీపీలో చేరారు. ఇక, వచ్చే ఎన్నికలకు రాజకీయంగా అందరూ సిద్దం అవుతున్న సమయంలో భూమ మౌనిక ఏ పార్టీలో ఎంట్రీ ఇస్తారు.. ఎక్కడ నుంచి బరిలోకి దిగుతారనేది ఇప్పుడు భూమా అనుచరుల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+