భూమా మౌనిక - మనోజ్ వివాహ ముహూర్తం ఖరారు..!?
కొద్ది రోజులుగా సాగుతున్న ప్రచారం నిజం కాబోతోంది. మంచు మనోజ్ - భూమా మౌనిక వివాహం ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. తాజాగా మంచు మనోజ్ కడపలో ఉన్న పెద్ద దర్గా అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్నారు. ఫిబ్రవరి నుంచి కొత్త జీవితం ప్రారంభించనున్నట్లు చెప్పుకొచ్చారు. అదే సమయంలో కొత్త సినిమాల గురించి ప్రస్తావించారు. మంచు మనోజ్ - భూమా మౌనిక వివాహం చేసుకోబోతున్నారంటూ కొంత కాలంగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఇప్పుడు మనోజ్ చెప్పినట్లుగా ఫిబ్రవరిలో వీరిద్దరి వివాహానికి ముహూర్తం ఖారారైనట్లు సమాచారం.

మనోజ్ - మౌనిక వివాహం ఖరారు..!
ప్రముఖ నటుడు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు..కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ కుటంబం భూమ దంపతుల రెండో కుమార్తె మౌనిక వివాహం ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 2, 2023 లో వీరిద్దరి వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. మంచు మనోజ్- మౌనిక కు ఇది రెండో వివాహం. ఇద్దరూ వ్యక్తిగత కారణాలతో తొలి వివాహ బంధానికి దూరం అయ్యారు.
కొంత కాలంగా మంచు మనోజ్ - మౌనిక చెన్నైలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న వీరిద్దరూ వివాహానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. గణపతి నవరాత్రి వేడుకల సమయంలో ఈ ఇద్దరు సికింద్రాబాద్ సీతాఫల్ మండి వద్ద ఒక వినాయకుడి మండపం వద్దకు కలిసి వచ్చారు. ఆ సమయంలోనే ఈ ఇద్దరు కలిసి వివాహం చేసుకుంటున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

ఫిబ్రవరిలో కొత్త ముహూర్తం..
కానీ, మనోజ్ తన వివాహంతో పాటుగా రాజకీయ ఎంట్రీకి సంబంధించి త్వరలోనే ప్రకటన చేస్తానని చెప్పుకొచ్చారు. ఇక, ఇప్పుడు ఇద్దరూ కలిసి ఆళ్లగడ్డలో భూమా దంపతుల విగ్రహాలకు నివాళి అర్పించారు. కడపలో అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న మంచు మనోజ్ ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఫిబ్రవరి నుంచి కొత్త జీవితం ప్రారంభిస్తున్నాని ప్రకటించారు.
అయితే, వివాహ బంధం గురించి మాత్రం ప్రస్తావించ లేదు. తాను కొత్త సినిమాలతో కొత్త జీవితం ప్రారంభిస్తున్నా.. ఫిబ్రవరి నుంచి కొత్త సినిమాలతో బిజీ అవుతున్నానని చెప్పుకొచ్చారు. తన జీవితం బావుండాలని ప్రార్థనలు చేసానని చెప్పారు. తనతో పాటు అందరు బావుండాలని కోరుకున్నట్లుగా మంచు మనోజ్ వెల్లడించారు. మంచు మనోజ్ ప్రస్తుతం అహంబ్రహ్మస్య అనే సినిమాలో నటిస్తున్నారు.

ఫిబ్రవరి నుంచి మనోజ్ కొత్త జీవితం
అటు మౌనిక కూడా రాజకీయంగా గతంలో అక్క భూమా అఖిలకు మద్దతుగా నిలిచారు. కానీ, కొంత కాలంగా రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. తన అక్కతోనూ మౌనికకు విభేదాలు వచ్చినట్లుగా ఆళ్లగడ్డ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది. తండ్రి ఆస్తులకు సంబంధించి పలు వివాదాలు సాగుతున్నాయి.
నంద్యాల ఉప ఎన్నికల సమయంలో భూమా పిల్లలు ఒక్కటిగా టీడీపీ అభ్యర్ధి విజయం కోసం పని చేసారు. ఆ సమయంలో అఖిల ప్రియ టీడీపీలో మంత్రిగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఓడిన తరువాత పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మౌనిక - మనోజ్ వివాహం పైన ప్రచారం వేళ..తాజాగా వివాహ ముహూర్తం అంశం తెర మీదకు వచ్చింది. ఇక, ఈ ముహూర్తానికి సంబంధించి మౌనిక - మనోజ్ అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.












Click it and Unblock the Notifications