రేవంత్ ను నడిపించిన ఆ ఇద్దరే ఇప్పుడు షర్మిల వెనుక - వై నాట్ ఏపీ..!!
ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. సీఎం జగన్ వర్సస్ టీడీపీ అధినేత చంద్రబాబు పోరు కొత్త మలుపులు తిరుగుతోంది. జగన్ ను ఓడించే లక్ష్యంతో చంద్రబాబు జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీ వైఖరి పైన స్పష్టత రావాల్సి ఉంది. ఈ సమయంలోనే కాంగ్రెస్ ఏపీలో కొత్త రాజకీయం మొదలు పెట్టింది. షర్మిలను ఏపీలో ప్రయోగించేందుకు సిద్దమైంది. కాంగ్రెస్ ఏపీలో ఏ మేర ప్రభావం చూపిస్తుందీ.. ఏ పార్టీ పైన ఎలాంటి ప్రభావం ఉంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.
ఆ ఇద్దరే ఇప్పుడు మరోసారి: ఏపీపైన రాహుల్ ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. ఏపీ పార్టీ ఇంఛార్జ్ గా గతంలో తెలంగాణకు పని చేసిన మాణికం ఠాగూర్ నియమితులయ్యారు. ఇప్పటికే ఆయన ఏపీలో తన ఆపరేషన్ ప్రారంభించారు. జనవరి 8న ఏపీకి రానున్న ఆయన పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.

గతంలో తెలంగాణ ఇంఛార్జ్ గా పని చేసిన సమయంలో రేవంత్ కు పీసీసీ చీఫ్ రావటం వెనుక ఠాగూర్ కీలకంగా పని చేసారు. రేవంత్ లోని శక్తిని హైకమాండ్ కు వివరించి ఒప్పించారు. ఆ తరువాత రేవంత్ పోటీ దారుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక..రేవంత్ కు ఎన్నికల సమయంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పెద్దదిక్కుగా వ్యవహరించారు. పార్టీలో చేరికలు..ప్రచార వ్యూహాల్లో దిక్సూచీగా నిలిచారు.
షర్మిల అంగీకరిస్తే కీలక బాధ్యతలు: రేవంత్ సీఎంగా ఎంపిక సమయంలోనూ డీకే శివకుమార్ దే ముఖ్య పాత్ర. ఇక, ఇప్పుడు ఈ ఇద్దరు ఠాగూర్, డీకే శివకుమార్ ఏపీలో షర్మిల కు బాధ్యతల వెనుక కీలకంగా వ్యవహరిస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత..డికే అక్కడ డిప్యూటీ సీఎం అయిన తరువాతనే షర్మిల కాంగ్రెస్ వైపు వెళ్లాలనే ఆలోచన మొదలైంది. పార్టీలో చేరిక..తన రాజకీయ భవిష్యత్ విషయంలో డీకే తో షర్మిల పలు మార్లు భేటీ అయ్యారు.

ప్రియాంకతో షర్మిలకు ఫోన్ చేయించిన డీకే శివకుమార్..ఆ తరువాత నేరుగా సోనియా, రాహుల్ తో కలిసే విధంగా సమావేశం ఏర్పాటు చేయించారు. తెలంగాణ నేతల కారణంగా షర్మిలకు అక్కడ ప్రాధాన్యత దక్కలేదు. ఇక్కడ ఏపీలో పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చేందుకు కూడా పార్టీ నేతలు అభ్యంతరం చెప్పటం లేదు. రాహుల్ వీరి నుంచి అభిప్రాయ సేకరణలోనూ తమ మద్దతు తెలిపారు.
Disturbing reports of Jagan misusing volunteers & Secretariat staff in AP, coupled with concerns over voter profiling & electoral roll manipulation. @ECISVEEP's silence raises questions.
— Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) December 31, 2023
Urgently calling for transparent deletion rules. 1/2 https://t.co/XqOQQH1R6V
వై నాట్ ఏపీ నినాదంతో: ఇక, ఈ నెల 3 లేదా 7వ తేదీన షర్మిల అధికారికంగా కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ నెల 2న రాహుల్ తో షర్మిల భేటీ కానున్నారు. ఆ సమయంలో పీసీసీ బాధ్యతలు, కడప నుంచి ఎంపీగా పోటీ చేయటం పైన షర్మిల తన అభిప్రాయం ఏంటో రాహుల్ కు స్పష్టం చేస్తారని సమాచారం. షర్మిల అంగీకరిస్తే పీసీసీ బాధ్యతలతో పాటుగా కడప ఎంపీగా పోటీలో దించేందుకు కాంగ్రెస్ సిద్దంగా ఉంది.
అదే సమయంలో షర్మిల కు రాజ్యసభ సీటు ఇవ్వాలని నిర్ణయించారు. పీసీసీ అధ్యక్ష బాధ్యతలకు షర్మిల అంగీకరించకపోతే...పార్టీ స్లార్ క్యాంపెయినర్ గా ఏపీలో ఎన్నికల ప్రచారం చేయించాలనేది పార్టీ వ్యూహం. ఇక..కాంగ్రెస్ నుంచి వైసీపీ, టీడీపీలోకి వెళ్లి..అక్కడ ఎడ్జస్ట్ కాలేకపోతున్న వారితో ఠాగూర్ ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించారని సమాచారం. దీంతో, ఏపీలో కాంగ్రెస్ అడుగుల పైన ఆసక్తి పెరుగుతోంది.












Click it and Unblock the Notifications