మాన్సాస్ ట్రస్ట్ వివాదం: అశోక్ గజపతి రాజు వ్యాఖ్యలకు సంచయిత కౌంటర్
మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి.ఇక ఇటీవల సంచయితను ట్రస్ట్ చైర్మన్ గా నియమించటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు అశోక్ గజపతి రాజు . ఇక ఏపీలో రాజకీయ దుమారం రేపుతున్న మాన్సాన్ ట్రస్టు వ్యవహారాలపై ప్రభుత్వ జోక్యం చేసుకుందని, ట్రస్టుల్లో అన్యమతస్తుల జోక్యం సరికాదని టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు చేసిన వ్యాఖ్యలపై మాన్సాన్ ట్రస్ట్ చైర్మన్ సంచయిత స్పందించారు. తన బాబాయి అయిన అశోక్ గజపతి రాజుకు సంచయిత కౌంటర్ ఇచ్చారు.

అశోక్ గజపతి రాజు వ్యాఖ్యలపై సంచయిత కౌంటర్
మాన్సాస్ ట్రస్ట్ భూములను కాజేసే కుట్ర చేస్తుందని, ప్రభుత్వం అందుకే ఈ నిర్ణయం తీసుకుందని , దాతల భూములు ఆలయాలకే చెందాలని పేర్కొన్నారు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు. ట్రస్టు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం సరికాదని పేర్కొన్న ఆయన చైర్మన్‌గా వేరే మతం వారిని నియమిస్తే సమస్యలు వస్తాయని చెప్పారు. ఇక ఇలా చెప్పటంపై సంచయిత మండిపడ్డారు. ఇక గతంలో ట్రస్ట్ సభ్యులుగా మహిళలు ఉన్నారని తాజాగా బయటకు వచ్చిన జీవో నేపధ్యంలో తెలిసింది.

తనకు అన్ని అర్హతలు ఉన్నాయన్న సంచయిత
ఇక ట్రస్ట్ చైర్మన్ గా ప్రభుత్వం సంచయితను నియమించడంపై అశోక్ గజపతిరాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ఆమె సమాధానం చెప్పారు. తనకు ట్రస్ట్ చైర్మన్ గా ఉండేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. తాను హిందువునని, నా మతం గురించి బాబాయ్ మాట్లాడితే బాధేస్తోందని సంచయిత చెప్పారు. వాటికన్ సిటీ వెళ్లి ఫోటో దిగితే నేను క్రిష్టియన్ అవుతానా? అని సంచయిత సూటిగా ప్రశ్నించారు.

తను హిందువునని ... మతం గురించి మాట్లాడటంపై వివరణ ఇచ్చిన సంచయిత
అశోక్ గజపతి రాజు ఎప్పుడూ మసీదుకి గానీ , చర్చికి గానీ వెళ్లలేదా? అన్న సంచయిత మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ కావడానికి తనకు అన్ని అర్హతలు ఉన్నాయని పేర్కొన్నారు . ఇక తనది వంశ పారంపర్యంగా వచ్చిన అవకాశమే అని మా తాతగారు పీవీజీ రాజు వారసత్వం కొనసాగించడానికి తనకు హక్కు ఉందని ఆమె పేర్కొన్నారు. అశోక్ గజపతి రాజు కుమార్తె అతిథికి ట్రస్ట్ బోర్డు లో అవకాశం కల్పించినపుడు తనకెందుకు అవకాశం ఇవ్వలేదని , తననెందుకు పక్కన పెట్టారు ఆరోజు తాను కనిపించలేదా? అని సంచయిత ప్రశ్నించారు. మరి దీనిపై అశోక్ గజపతి రాజు సమాధానం చెప్పాల్సి ఉంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications