• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బ్లీచింగ్ పౌడర్, పారాసిటమాల్ తర్వాత కొత్త మందు బంతిపూలా? రోజాపై అనిత వ్యంగ్యం

|

నగరి ఎమ్మెల్యే రోజా తాజాగా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారన్నఆరోపణలు ఎదుర్కొంటున్నారు . ఇక చిత్తూరు జిల్లా వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజాపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుత్తూరు సుందరయ్యనగర్ లో బోరుబావి ప్రారంభోత్సవానికి వెళ్ళిన రోజాపై వైసీపీ శ్రేణులు బంతి పూలు చల్లి మరీ ఆమెకు ఘన స్వాగతం పలికారు. అక్కడి జనం ఆమెతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ అభిమానులు కూడా ఈ కార్యక్రమానికి వెళ్ళారు. ఇక దీనిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీ మహిళా నేత మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత రోజాపై సెటైర్లు వేశారు .

నేను రెడీ.. కన్నా,సుజనా ప్రమాణం చేస్తారా !! పురంధరేశ్వరిని రచ్చలోకి లాగిన విజయసాయి

 నగరి ఎమ్మెల్యే రోజాపై విమర్శనాస్త్రాలు సంధించిన టీడీపీ నేత అనిత

నగరి ఎమ్మెల్యే రోజాపై విమర్శనాస్త్రాలు సంధించిన టీడీపీ నేత అనిత

ఇక నగరి ఎమ్మెల్యే రోజా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని టీడీపీ మహిళా నాయకురాలు వంగలపూడి అనిత ఆరోపించారు . ప్రపంచం అంతా సామాజిక దూరం అని మొత్తుకుంటున్న కీలక సమయంలో తుగ్లక్ సైన్యం మాత్రం అదేమీ పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలను ఉద్దేశించి అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే రోజా పర్యటనకు సంబంధించి వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన అనిత ఇక ఆమెపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు . బ్లీచింగ్ పౌడర్, పారాసిటమాల్ తర్వాత మీ కౌరవ సైన్యం కనిపెట్టిన కొత్త మందు బంతిపూలా? రోజా గారూ అని అనిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

రోజాపై బంతిపూలు చల్లటాన్నితీవ్రంగా తప్పుపట్టిన అనిత

రోజాపై బంతిపూలు చల్లటాన్నితీవ్రంగా తప్పుపట్టిన అనిత

అంతే కాదు ఆ వీడియోలో కొందరు రోజాకు స్వాగతం పలుకుతూ ఆమెపై బంతిపూలు చల్లటాన్ని అనిత తీవ్రంగా తప్పుపట్టారు. కరోనా విజృంభిస్తున్న వేళ పక్కపక్కనే నిలబడి బంతిపూలు చల్లటం ఏంటి రోజా రెడ్డి గారూ..? బంతిపూలు చల్లితే కరోనా చచ్చిపోతుందా? అని ప్రశ్నించారు. అంతే కాదు మనం రాజరికంలో ఉన్నామా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అనే సందేహం గత పది నెలలుగా నన్ను తొలుస్తుంది. కానీ ఇప్పుడు కన్ఫార్మ్ అయ్యింది. మనం రాజరికంలో ఉన్నామని ఖచ్చితమైన కన్ఫర్మేషన్‌ను రోజా రెడ్డి ఇచ్చారు అని వ్యాఖ్యానించారు అనిత .

బంతిపూలతో కరోనా పోతుందా అని సెటైర్లు

బంతిపూలతో కరోనా పోతుందా అని సెటైర్లు

లాక్‌డౌన్ సమయంలో బియ్యపు మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తిలో ట్రాక్టర్ ర్యాలీ చేసి మరీ సీఎం జగన్ భార్య భారతి రెడ్డి భజన చేశారని, అక్కడ 11 మందికి కరోనా వ్యాపించిందని అనిత పేర్కొన్నారు. దీనికి బాధ్యులెవరు? అని ప్రశ్నించారు. ఓ జాతియ పత్రిక కోవ్‌ఇడియట్స్‌గా ఈ అద్భుతమైన ఘట్టాన్ని కీర్తించింది అని అనిత సెటైర్లు వేశారు . అంతే కాదు సామాజిక దూఅరం పాటించాలని లెక్చర్లు చెప్పే రోజా గారు సామాజిక దూరం ఏ మాత్రం పాటించకుండా బంతిపూలతో స్వాగతాలు చెప్పించుకోవటం చాలా హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు . ఇప్పుడు గతంలో జగన్ చెప్పిన పారాసిటామాల్, బ్లీచింగ్ పౌడర్ రెండు మందులు పోయి ఇప్పుడు బంతిపూల మందు వచ్చిందా అని అనిత విమర్శలు గుప్పించారు.

  Lockdown : Students In Hyderabad Donating Food & Grocery For 1500 People In Balanagar

  English summary
  Anita made a serious mistake in welcoming Roja and showering mariegold flowers on her. What's Roja Reddy standing next to her while Corona is booming? Asked whether the corona will die if the mariegold flowers is showered. Are we in the kingdom? Are we in a democracy? Doubt has pushed me for the past ten months. But now it is conform. Roja Reddy gave the perfect conformation that we are in the kingdom, commented tdp leader anitha .
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X