ప్రపంచాన్ని శాసించే స్థాయికి మార్క్ శంకర్.. పవన్ కళ్యాణ్ తనయుడిది మహర్జాతకమట!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద ఘటనతో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారాడు. ఇంతకాలం మార్క్ శంకర్ గురించి ఎప్పుడు ఎవరు మాట్లాడుకోలేదు. కానీ ఏప్రిల్ ఎనిమిదవ తేదీన సింగపూర్ లోని ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటున్న మార్క్ శంకర్ అక్కడ అగ్ని ప్రమాదానికి గురికావడంతో ఒక్కసారిగా అందరి దృష్టి మార్క్ శంకర్ పైకి మారింది.

మార్క్ శంకర్ గురించి ఆసక్తికర విషయం
ఇక అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు అభిమానులు పెద్ద ఎత్తున పూజలు, ప్రార్థనలు చేశారు. ఆ తరువాత మార్క్ శంకర్ సేఫ్ గా బయటపడ్డాడని చిరంజీవి ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రస్తుతం మార్క్ శంకర్ కు సంబంధించి ఒక ఆసక్తికర విషయం నెట్టింట వైరల్ గా మారింది.

Mark Shankar rules the world Pawan Kalyan son numerology horoscope goes viral

మార్క్ శంకర్ తండ్రిని మించిన తనయుడు అవుతాడన్న న్యుమరాలజీ
మార్క్ శంకర్ 2017 అక్టోబర్ 10వ తేదీన జన్మించాడు. మార్క్ శంకర్ జాతకాన్ని బట్టి అతను తండ్రిని మించిన తనయుడు అవుతాడని ప్రముఖ న్యూమరాలజిస్ట్ కిరణ్ నెహ్రూ పేర్కొన్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ కుమారుడి పూర్తి పేరు కొణిదెల మార్క్ శంకర్ పవనోవిచ్ కావడంతో న్యూమరాలజీ ప్రకారం అతని పేరులో 9/2 కాంబినేషన్ ఉందని ఈ కాంబినేషన్ లో ఉన్న పేర్లు కలిగిన వాళ్ళు గొప్ప శక్తివంతులు అవుతారని పేర్కొన్నారు.

ఎవరూ ఊహించని స్థాయికి పవన్ తనయుడు
ఇదే సమయంలో 2025 సంవత్సరంలో స్వల్ప ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. న్యూమరాలజీ ప్రకారం మార్క్ శంకర్ అనే పేరులో దయ, ధైర్యం ఉన్నాయని, అతని స్వభావం కూడా అలాగే ఉంటుందని పేర్కొన్నారు. జీవితంలో ఊహించని స్థాయికి, ప్రపంచం మొత్తం గుర్తించే స్థాయికి మార్చ్ శంకర్ ఎదుగుతాడని చెప్తున్నారు.

మార్క్ శంకర్ పేరు వాడకంపై హెచ్చరిక
ఇక పవన్ కళ్యాణ్ కుమారుడు పూర్తి పేరు మార్క్ శంకర్ పవనోవిచ్ అయినప్పటికీ మార్క్ శంకర్ పేరు ఎక్కువగా వాడకంలో ఉండడంతో న్యూమరాలజీ ప్రకారం 16 నెంబర్ వస్తుంది. అయితే దీనివల్ల ఒకసారి పైకి లేచి కింద పడే ప్రమాదం ఉంటుందని, ప్రస్తుతం బాలుడికి అగ్ని ప్రమాదం జరగడం వెనుక కూడా ఇది ఉందని తెలిపారు.

మార్క్ శంకర్ పేరులో ఒక లెటర్ యాడ్ చేస్తే అద్భుతమేనట
అగ్ని ప్రమాదం జరిగింది ఏప్రిల్ 8వ తేదీ, పవన్ కళ్యాణ్ కుమారుడు వయసు 8 సంవత్సరాలు.. ఇక ఈ మొత్తం కలిపితే 16 కావడం, న్యూమరాలజీ ప్రకారం ప్రమాదాన్ని సూచించిందని చెబుతున్నారు. అయితే మార్క్ శంకర్ పేరులో, అదనంగా ఒక A ని చేరిస్తే భవిష్యత్తులో అద్భుతాలు జరుగుతాయని, అతనికి ఎటువంటి ఇబ్బంది ఉండబోదని, జీవితంలో ఎటువంటి ఆటంకాలు రావని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+