భర్త అక్రమ సంబంధం: పిల్లలతో కలిసి భార్య సంపులో దూకి ఆత్మహత్య

Suicide
హైదరాబాద్: భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో మనస్తాపం చెందిన ఓ గృహిణి పిల్లలతో కలిసి ఇంట్లోని సంపులో దూకి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాదులోని ఆసిఫ్‌నగర్‌లోని జిర్రాలో నవాజ్‌ పాషా, షనూర్‌బేగం (24) దంపతులు నివసిస్తున్నారు. వీరికి వదానియా (3), జూబియా (2) అనే ఇద్దరు పిల్లలున్నారు. నవాజ్‌పాషా జాంబాగ్‌ మార్కెట్‌లో పూల వ్యాపారం చేస్తుంటాడు.

ఇతడు షనూర్‌బేగానికి వరసకు పిన్ని అయ్యే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. భార్యను తరచూ వేధిస్తున్నాడు. దీంతో షనూర్‌బేగం మనస్తాపం చెందింది. గురువారం ఉదయం భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన తరువాత పిల్లల్ని సంప్‌లో పడేసి తానూ దూకింది. చుట్టుపక్కల వారు గమనించి కాపాడే ప్రయత్నం చేయగా ఫలితం లేకపోయింది.

సమాచారమందుకున్న ఆసిఫ్‌నగర్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీయించి పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నవాజ్‌పాషా, షరూర్‌బేగం బంధువుల నుంచి సమాచారం సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ గౌస్‌ మొహియుద్దీన్‌, ఆసిఫ్‌నగర్‌ సీఐ శ్రీకాంత్‌ సందర్శించారు.

దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్టు షనూర్‌ బేగం సోదరి ఒమేరాబేగం తెలిపింది. నవాజ్‌పాషా వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యను వేధించే వాడని ఒమెరాబేగం తెలిపింది. తరచూ వేధిస్తుండటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉంటుందని ఆమె పోలీసులకు తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+