రానా ప్రారంభించాల్సిన థియేటర్: ప్రారంభానికి ముందే బూడిద

Posted By:
Subscribe to Oneindia Telugu

గుంటూరు: ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలో ప్రారంభానికి ముందే ఓ థియేటర్ అగ్ని ప్రమాదానికి దగ్ధమైంది. ఈ థియేటర్ దగ్గుబాటి రామానాయుడు కుటుంబానికి చెందినది.

మరమ్మత్తులు చేస్తుండగా

మరమ్మత్తులు చేస్తుండగా

ఈ థియేటర్ సురేష్ మహల్. ఈ సినిమా హాల్‌ను మరమ్మతులు చేసి రెండు థియేటర్లుగా అత్యాధునిక టెక్నాలజీతో తీర్చిదిద్దారు.

రానా చేతుల మీదుగా

రానా చేతుల మీదుగా

ఒక థియేటర్‌ పూర్తి కావడంతో రేపు రామానాయుడు మనవడు, సినీ హీరో రానా చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేశారు.

ఏసీలు బిగించే సమయంలో

ఏసీలు బిగించే సమయంలో

అయితే గురువారం ఏసీలు బిగించే సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

అందరూ చూస్తుండగా హాల్ దగ్ధం

అందరూ చూస్తుండగా హాల్ దగ్ధం

అందరూ చూస్తుండగానే హాల్‌ మొత్తానికి మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది.

లక్షల ఆస్తి నష్టం

లక్షల ఆస్తి నష్టం

స్థానికుల సమాచారంతో అగ్నిమాపక శకటాలు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదంలో రూ.లక్షల మేర ఆస్తినష్టం సంభవించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Massive fire accident at Suresh Mahal Theatre in Chirala, Prakasham district on thursday.
Please Wait while comments are loading...