వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కోసం రంగంలోకి దిగనున్న మాయావతి .. ప్రచార షెడ్యూల్ ఇదే

|
Google Oneindia TeluguNews

పోలింగ్ కు ఎంతో సమయం లేదు. దీంతో అన్ని పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ గా చేసుకుని దూకుడు చూపిస్తున్నాయి. మాట తూటాలు పెలుస్తున్నాయి. ఇక ఏపీలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ నేతలతో ప్రచారం చేయిస్తూ ,ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వైసీపీ అధినేత జగన్ కుటుంబ సభ్యలతో ప్రచారం చేయిస్తూ సెంటిమెంట్ తో ఓటు బ్యాంకుకు గాలం వేస్తున్నారు. ఇక తాజాగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా ఆ దిశగా పావులు కదుపుతున్నారు.

ఏపీలో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్న బీఎస్పీ అధినేత్రి మాయావతితో ప్రచారానికి రంగం సిద్ధం చేశారు. జనసేన, బీఎస్పీ, వామపక్షాల అభ్యర్థుల తరపున మాయావతి రెండు రోజుల పాటు ఏపీలో ప్రచారం నిర్వహించనున్నారు. తన మాటలతో ప్రత్యర్ధులపై దాడి చెయ్యనున్నారు. ఈ మేరకు పవన్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ప్రకటన విడుదల చేశారు. మాయావతి రెండు రోజుల ప్రచార షెడ్యూల్ ఖరారు చేస్తూ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మాయావతి మూడు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు . విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ లలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొని ఆమె జనసేనకు తన సహకారం అందించనున్నారు.

వైసీపీ లో చేరగానే పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన జీవితా రాజశేఖర్వైసీపీ లో చేరగానే పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన జీవితా రాజశేఖర్

Mayawati Campaign In Andhra Pradesh for the BSP allies Janasena.. this is the schedule

మాయావతి షెడ్యూల్ ఇదే:

  • మంగళవారం రాత్రి లక్నో నుంచి మాయావతి విశాఖకు చేరుకుంటారు.
  • బుధవారం విశాఖలో పాత్రికేయుల సమావేశం
  • అదే రోజు విజయవాడలోని అజిత్ సింగ్ నగర్‌‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో భారీ బహిరంగసభ
  • గురువారం తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ గ్రౌండ్‌లో భారీ బహిరంగసభ
  • గురువారం సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో పవన్ కళ్యాణ్‌తో కలిసి బహిరంగసభ
English summary
BSP chief Mayawati and Jana Sena Party founder Pawan Kalyan, who formed an alliance for the Assembly polls in Andhra Pradesh, would jointly address election meetings at Vijayawada, Tirupati and Hyderabad, the Jana Sena said on Monday.They will campaign for the success of the nominees of Jana Sena, BSP and Left parties in Andhra Pradesh, it said in a release.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X