పిలిచి, పెళ్లి కాకుండా చేశారు అందుకే: మేయర్ అనురాధపై చింటూ
చిత్తూరు: మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూ విచారణలో ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. తనను క్రిమినల్‌గా చూపించి, తనకు పెళ్లి కాకుండా చేశారని అందుకే వారిని హతమార్చానని చెప్పాడని తెలుస్తోంది.
చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్‌లను చిత్తూరు మున్సిపల్ కార్యాలయంలో నిందితులు హత్య చేసిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. నిందితులను ప్రశ్నిస్తున్నారు. ఇందులో భాగంగా చింటూను కూడా వారు ప్రశ్నిస్తున్నారు.

అనురాధ, మోహన్‌లను తానే హత్య చేసినట్లు చింటూ విచారణలో అంగీకరించినట్లుగా తెలుస్తోంది. తాను మెరైన్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ముంబైలో ఉద్యంగో చేసుకుంటున్నానని, తన మేనమామ మోహన్ తనకు అండగా ఉండేందుకు ఉద్యోగం వదిలేసి రావాలని చెప్పడంతో వచ్చానని చింటూ చెప్పాడు.

తన మేనమామపైన దాడి చేశారన్న ఆరోపణల నేపథ్యంలో చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సికె బాబు పైన దాడి చేసి చింటూ వార్తల్లోకి ఎక్కాడు. మేనమామ అజ్ఞాతంలో ఉన్నంతకాలం చింటూ చక్రం తిప్పాడు. ఆ తర్వాత అత్త అనురాధ మేయర్ అయ్యారు. చింటూ ప్రాధాన్యతను తగ్గించారు. పైగా తనపైన క్రిమినల్ ముద్రవేశారని, దానిని తాను భరించలేకపోయానని చింటూ చెప్పాడని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications