పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఆకాశమంత... మెగా బ్రదర్ నాగబాబు భావోద్వేగ ట్వీట్
ఏపీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన పోరాటం, ఆయన కోసం కదిలిన సైన్యం చేసిన యుద్ధం అంతా ఇంతా కాదు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి ప్రజలకు అర్ధం కావాలని ఇటీవల అనేక సందర్భాల్లో ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ రావడానికి గల కారణం గురించి, పవన్ కళ్యాణ్ కి ప్రజాసేవ చేయాలని ఉన్న కాంక్ష గురించి మెగాస్టార్ చిరంజీవి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు.
నాగబాబు భావోద్వేగ ట్వీట్
ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన నాగబాబుకు అమితమైన ప్రేమ ఉంది. అనేక సందర్భాల్లో నాగబాబు తన ప్రేమను వ్యక్తీకరించారు. జనసేనపార్టీ కోసం, పవన్ కళ్యాణ్ కోసం అండగా నిలిచారు. ఇక తాజాగా ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా కూటమి కోసం టికెట్ త్యాగం చేశారు. అయినా తమ్ముడి కోసం అన్నగా ముందుకు సాగారు. ఇక తాజాగా ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ పైన భావోద్వేగ ట్వీట్ చేశారు.

ట్వీట్ లో పవన్ గొప్పతనం చెప్పిన నాగబాబు
నాగబాబు చేసిన ట్వీట్ లో నిన్ను నమ్మని వాళ్ళ కోసం కూడా ఎందుకు నిలబడతావ్ అని అడిగితే చెట్టును చూపిస్తాడు అది నాటిన వాళ్లకు మాత్రమే నీడనిస్తుందా అని .. నీతో నడిపిన వాళ్ల కోసం కూడా ఎందుకు నిందలు మోస్తావ్ అని అడిగితే.. వర్షాన్ని చూపిస్తాడు.. తనకి మొక్కని, రైతు కంటిని తడుపుకుంటూ పంటనే తడుపుతుంది అని.. పవన్ కళ్యాణ్ గురించి చెప్పారు.
నిన్ను నమ్మని వాళ్ల కోసం కూడ ఎందుకు నిలబడతావ్ అని అడిగితే 'చెట్టుని చూపిస్తాడు అది నాటిన వాళ్లకి మాత్రమే నీడనిస్తుందా అని...
— Naga Babu Konidela (@NagaBabuOffl) May 12, 2024
నీతో నడవని వాళ్ల కోసం కూడ ఎందుకు నిందలు మోస్తావ్ అని అడిగితే 'వర్షాన్ని చూపిస్తాడు తనకి మొక్కని 'రైతు కంటిని తడపుకుండా పంటనే తడపుతుందని....
అప్పట్నుంచి… pic.twitter.com/uqjCAkEKXe
కూటమి రాబోతుంది... అన్న నాగబాబు
అప్పట్నుంచి అడగడం మానేసి ఆకాశం వంటి అతని ఆలోచన విశాలతను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను.. సేనాని మీరు చిందించిన ప్రతి చెమట బొట్టు రేపటితరం ఎక్కబోయే మార్గదర్శక మెట్టు కాబోతుంది.. కూటమి రాబోతుంది అంటూ నాగబాబు భావోద్వేగ ట్వీట్ చేశారు.
విజయీభవ అంటూ తమ్ముడికి ఆశీర్వాదం
సిరా పూసిన సామాన్యుడి వేలి సంతకంతో నీ గెలుపు సిద్ధమైంది... విజయీభవ అంటూ పవన్ కళ్యాణ్ ను ఆశీర్వదించారు. ఈ ట్వీట్ లో పవన్ కళ్యాణ్ ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్న ఒక ఫోటోను నాగబాబు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ఇక ఈ పోస్ట్ ద్వారా జనసేన ని పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని నాగబాబు మరోమారు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు.












Click it and Unblock the Notifications