తమ్ముడూ ఈ సారి లేదు కుమ్ముడు.. తేల్చేసిన మెగా బ్రదర్
Recommended Video

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి ప్రచారంలో పాల్గొంటారా లేదా అన్నదానిపై చిరంజీవి కుటుంబం క్లారిటీ ఇచ్చేసింది . ఈ సారి ఎక్కడా విమర్శలకు తావివ్వకుండా చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉండాలనిభావించి ఏ పార్టీ తరపున ప్రచారం చెయ్యనని చెప్పారని అందరికీ తెలుసు. అయినా చిరంజీవి తెలంగాణా లోని చేవెళ్ళ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రావు కోసం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారాని ప్రచారం జోరుగా సాగింది .

తాండూరు ఎమ్మెల్యే ప్రకటనతో చిరు ప్రచారంపై వార్తలు
ఇక చిరంజీవి తెలంగాణలో ప్రచారం చేస్తారనే విషయాన్ని తాండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 8న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు చిరంజీవి వికారాబాద్ రానున్నారని తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలిపారు. వీరిరువురూ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తరఫున ప్రచారం చేస్తారని ఆయన పేర్కొనటం ఒకరకంగా రాజకీయ దుమారం రేపింది.

ఏపీ నుండి కాకుండా తెలంగాణా నుండి ప్రచార నిర్ణయం .. చిరంజీవి తీసుకోలేదు
ఎందుకంటే ఏపీ నుండి గెలిచిన, కేంద్ర మంత్రి హోదాలో పని చేసిన చిరంజీవి ఏపీ ముఖం కూడా చూడకుండా , తెలంగాణలో ప్రచారం చెయ్యటం అటు కాంగ్రెస్ నాయకులకు, మరో పక్క సోదరుడి సహకారం ఉంటుంది అని భావించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు షాక్ అని చెప్పాలి . అసలు ఏపీని వదిలేసి తెలంగాణా లో ప్రచారం చెయ్యటం చిరంజీవి తీసుకున్న నిర్ణయం కాదని తెలుస్తుంది.

సైరా సినిమాతో బిజీగా ఉన్నారు .. ప్రచారం చెయ్యరు .. మెగా ఫ్యామిలీ
మెగాస్టార్ చిరంజీవి రానున్న ఎన్నికలకు సంబంధించి, చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటాడని, గత కొద్దీ రోజులుగా ప్రచారం జరుగుతున్న ఈ విషయంపై మెగా కుటుంబం ఎట్టకేలకు ఒక క్లారిటీ ఇచ్చేసింది. చిరు ప్రచారంలో పాల్గొంటాడు అని వస్తున్నటువంటి వార్తలన్ని అవాస్తవమని, చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహ రెడ్డి షూటింగ్ లో బిజీగా ఉన్నారని, ఎన్నికలకు మరియు ప్రచారానికి దూరంగా ఉంటారని తెలియజేసింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications