వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మా నాన్న జోలికి వస్తే సహించం - తమ్ముడంటే ప్రాణం: రాం చరణ్ వార్నింగ్..!!

చిరంజీవి జోలికి వస్తే సహించమని రాం చరణ్ హెచ్చరించారు. చిరంజీవికి తమ్ముడంటే ప్రాణమని చెప్పారు.

|
Google Oneindia TeluguNews

మెగా పవర్​ స్టార్ రామ్​చరణ్​ కీలక కామెంట్లు చేశారు. చిరంజీవి మౌనం వీడితే ఎవరూ భరించలేరని వారికి సీరియస్​ వార్నింగ్​ ఇచ్చారు. చిరంజీవి సౌమ్యుడని అందరూ చెబుతారు..ఆయన నెమ్మదిగా ఉంటారేమో..మేం ఉండమంటూ హెచ్చరించారు. హన్మకొండలో జరిగిన వాల్తేరు వీరయ్య విజయోత్సవ వేడుకలో రాం చరణ్ కీలక వ్యాఖ్యలు చేసారు.

తాను ఈ వేడుకలను గెస్టుగా రాలేదని...అభిమానిగా వచ్చానని చెప్పుకొచ్చారు. తమ్ముడంటే నాన్న గారికి ప్రాణమని చెబుతూ.. సినిమాలో పాత్రల గురించి వివరించారు. చిరంజీవిని ఎవరైనా అనాలంటే అది ఫ్యామిలీకి..మెగా అభిమానులకే ఉంటుందని చరణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ - పొలిటికల్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

నాన్నను ఏమైనా అంటే ఊరుకోం..

నాన్నను ఏమైనా అంటే ఊరుకోం..

సంక్రాంతి కానుకగా విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమా బ్లాక్​ బస్టర్​గా నిలిచింది. దీంతో హనుమకొండలో సక్సెస్​ మీట్​ నిర్వహించింది చిత్ర బృందం. ముఖ్య అతిథిగా హాజరైన మెగా పవర్​ స్టార్ రామ్​చరణ్​ ఎవరి పేరను ప్రస్తావించకుండానే కీలక వ్యాఖ్యలు చేసారు. చిరంజీవి మౌనంగా..సౌమ్యంగా ఉంటారని అందరికీ తెలుసన్నారు.

ఆయన మౌనం వీడితే భరించలేరని హెచ్చరించారు. నాన్న మౌనంగా ఉంటారేమో కానీ, తాము కాదని తేల్చి చెప్పారు. ఆయనను ఏమైనా ఉంటే ఊరుకోబోమని రాం చరణ్ తేల్చి చెప్పారు. ఆయనను అనాలంటే కుటుంబ సభ్యులైనా.. అభిమానులైన అయి ఉండాలన్నారు. పవన్ కల్యాణ్ ను విమర్శించే క్రమంలో మెగా బ్రదర్స్ పైన చేస్తున్న రాజకీయ విమర్శలకు సమాధానంగానే రాం చరణ్ ఈ హెచ్చరికలు చేసారనే ప్రచారం మొదలైంది.

తమ్ముడంటే నాన్నగారికి ప్రాణం

తమ్ముడంటే నాన్నగారికి ప్రాణం

ఇదే సమయంలో రాం చరణ్ మరిన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. తమ్ముడంటే నాన్న గారికి ప్రాణమని చెప్పుకొచ్చారు. ఆ ప్రేమ ఎలాంటిదో వాల్తేరు వీరయ్య సినిమాలో చూపించారని వ్యాఖ్యానించారు. చిరంజీవి ఉద్దేశించి తమ్ముడు పాత్రలో రవి చెప్పిన ఒక డైలాగును ప్రస్తావించారు. ఆ డైలాగు ఇంకెవరైనా అని ఉంటే ఏమయ్యేదని చరణ్ ప్రస్తావించారు.

ఆ డైలాగు అన్నది తమ్ముడి కాబట్టి..తమ్ముడు పైన ఆయనకు అంత ప్రేమ ఉంది కాబట్టి..అంటూ చరణ్ చెప్పుకొచ్చారు. సాధారణంగా చిరంజీవి చాలా క్వైట్ గా ఉంటారన్నారు. ఆయన క్వైట్ గా ఉంటేనే ఇంత మంది వచ్చారని..ఆయన కొంచెం బిగపట్టి మాట్లాడితే ఏమువుతుందో గుర్తు పెట్టుకోవాలంటూ హెచ్చరించారు. తాను కూడా క్వైట్ గానే క్వైట్ గా ఉండమని చెబుతున్నానంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

రవితేజ నాకు మరో పవన్ కల్యాణ్ - చిరంజీవి

రవితేజ నాకు మరో పవన్ కల్యాణ్ - చిరంజీవి


వాల్తేరు వీరయ్య విజయం సాధిస్తుందని అనుకున్నా..ఈ స్థాయికి వెళ్తుందని ఊహించలేదని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు దాదాపు రూ 250 కోట్లక పైగా వసూళ్లు సాధించిందంటేనే ఇదెలాంటి విజయమో అర్దం చేసుకోవచ్చని పేర్కొన్నారు. రవితేజను చూస్తే తనకు మరో పవన్ కల్యాణ్ లా కనిపిస్తాడని చిరంజీవి చెప్పారు.

సినిమాలో తన పాత్ర చనిపోయే సన్నివేశాన్ని పవన్ ను ఊహించుకొని చేశానని వివరించారు. అందుకే ఆ సన్నివేశం అంత అద్బుతంగా వచ్చిందని చెప్పుకొచ్చారు. నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్ దాకా వెళ్లిందంటే తెలుగు వాళ్లకు గర్వకారణమన్నారు. చరణ్ స్థానంలో తానే ఉన్నంత గర్వంగా ఉందని పేర్కొన్నారు. దేశానికే గర్వకారణమైన విషయంగా చిరంజీవి పేర్కొన్నారు. రాం చరణ్ చేసిన హెచ్చరికలు ఎవరిని ఉద్దేశించి అనేది ఇప్పుడు చర్చ కొనసాగుతోంది.

English summary
Mega Power Star Ram Charan serious comments in Waltair Veerayya success meet, lead to big debate in Cine and Political Circles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X