Mark Shankar Health Update: పవన్ కుమారుడి హెల్త్ అప్డేట్ ఇచ్చిన చిరంజీవి..!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. అగ్ని ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ ను హుటాహుటిన ఆస్పత్రికి చేర్చి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. పవన్ భార్య అనా లెజ్నోవా అక్కడే ఉండి కుమారుడి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను భారత్ లో ఉన్న చిరంజీవి కుటుంబ సభ్యులకు అందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్ధితిపై అప్డేట్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ కుమారుడికి గాయాలపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి.. 8 ఏళ్ల మార్క్ శంకర్ ప్రస్తుతం బాగానే ఉన్నాడని తెలిపారు. అగ్నిప్రమాదంలో శంకర్ కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయని చిరంజీవి తెలిపారు. దీంతో మెగా అభిమానులు ఊపిరిపీల్చుకుంటున్నారు.

మరోవైపు పవన్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడన్న సమాచారంతో పలువురు సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. ఇందులో ఏపీ మంత్రి నారా లోకేష్, తెలంగాణ బీఆర్ఎస్ నేత కేటీఆర్ తో పాటు పలువురు ఉన్నారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు నారా లోకేష్ ట్వీట్ చేశారు. ప్రమాద వార్త విని తాను షాక్ కు గురైనట్లు వెల్లడించారు. కేటీఆర్ కూడా దాదాపు ఇలాంటి ట్వీట్ చేశారు. పవన్ కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
Shocked to hear about the fire accident at a school in Singapore in which @PawanKalyan Anna's son, Mark Shankar, sustained injuries. Wishing him a speedy and full recovery. Strength and prayers to the family during this tough time.
— Lokesh Nara (@naralokesh) April 8, 2025
సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం @PawanKalyan గారి కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్లు తెలుసుకుని దిగ్భ్రాంతికి లోనయ్యాను
— KTR (@KTRBRS) April 8, 2025
ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. I pray for the well being of the young boy












Click it and Unblock the Notifications