జగన్ ప్రభుత్వంలోనే దిక్కులేదు, ఇక చంద్రబాబు పట్టించుకుంటారా ?, వైసీపీ లీడర్స్
గత వైసీపీ ప్రభుత్వం హయాంలో గెలిచిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామపంచాయతీ సభ్యులు, వార్డు మెంబర్లు చాలామంది మేము ఎందుకు గెలిచాంరా దేవుడా అని ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత మూడు సంవత్సరాల నుండి జగన్ ప్రభుత్వం లోనే మమ్మల్ని ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదని, మాకు జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేదని వైసీపీకి చెందిన చాలా మంది ప్రజాప్రతినిధులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మారిపోయిందని, అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మమ్మల్ని ఏ మాత్రం ఏం పట్టించుకుంటుందని వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మాజీ సీఎం జగన్ రాయలసీమకు చెందినవాడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీకి చెందిన 52 మంది జడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. కర్నూలు జిల్లా జడ్పీ చైర్మన్ కూడా వైసీపీ నాయకుడే.

జడ్పీ చైర్మన్ కి రూ. 40,000 జీతం, జడ్పీటీసీ సభ్యుడికి నెలకు రూ. 6,000 జీతం ఇవ్వాల్సి ఉంది. మూడు సంవత్సరాల క్రితం వైసీపీ ప్రభుత్వంలో గెలిచిన జడ్పీటీసీలకు మూడు నెలలకు ఒకసారి జీతాలు వారి అకౌంట్లో వేశారని, గత పది నెలలుగా ఒక నెల కూడా కర్నూలు జిల్లాకు చెందిన జడ్పీటీసీ సభ్యులకు జీవితాలు ఇవ్వలేదని వైసీపీకి చెందిన ఓ సీనియర్ జడ్పీటీసీ సభ్యుడు విచారం వ్యక్తం చేశారు.

జగన్ సీఎం గా ఉన్న సమయంలోనే మాకు జీతాలు రాలేదని, మేము చెప్పిన పనులు చేయడానికి అధికారులు కూడా ఆసక్తి చూపించడం లేదని, ఇక ప్రభుత్వం మారిపోయిన తర్వాత వైసీపీ చెందిన జడ్పీటీసీలు అంటే చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకుంటుందని, ఇక రాజీనామాలు చేసి శుభ్రంగా ఇంట్లో ఉంటే చాలా మంచిదని వైసీపీకి చెందిన సీనియర్ జడ్పీటీసీ సభ్యుడు అంటున్నారు.
ఇంతకాలం మా సొంత డబ్బుతో సభలు, సమావేశాలు నిర్వహించామని, సొంత ఖర్చులతో జడ్పీ ఆఫీసులకు వచ్చి వెళ్లామని, ఇకముందు మేము మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోలేమని కర్నూలు జిల్లాకు చెందిన జడ్పీ చైర్మన్ తో సహా చాలామంది వైసీపీకి చెందిన జడ్పీటీసీలు బహిరంగంగానే అంటున్నారని ఆ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు అంటున్నారు. గత జగన్ ప్రభుత్వంలో మమ్మల్ని పట్టించుకోలేదని వైసీపీ చెందిన కొందరు నాయకులు ఇప్పుడు బహిరంగంగా చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications