మండుతున్న ఎండలు: భానుడి దెబ్బకు జనం విలవిల(ఫోటోలు)
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు బాగా పెరిగాయి. ఈ వేసవిలో ఎన్నడూలేనంతగా సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. మంగళవారం ఉదయం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించాడు. మధ్యాహ్నానికి మరింతగా విజృంభించడంతో, చాలా మంది ప్రజలు ఇళ్లు, కార్యాలయాల నుంచే బయటకు రావడానికి భయపడ్డారు.
నెత్తిపై గొడుగులు, ముఖానికి ముసుగులు వేసుకొని వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. విశాఖపట్నంలో ఇటీవల సంభవించిన హుదూద్ తుఫాన్ దెబ్బకి పచ్చని చెట్లన్నీ నేలకూలాయి.
చాలా చోట్ల మోడుబారిన చెట్లే దర్శమిస్తున్నాయి. మరికొన్ని చెట్లు చిగురు తొడిగినా నీడనిచ్చేంత పచ్చదనం రాలేదు. గతంలో ఎన్నడూలేనంతగా మంగళవారం నాడు నగరంలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఈ వేసవికి ఇదే అత్యధిక ఉష్ణోగ్రత.
ఈ వేసవి తాపం మరికొన్ని రోజులు ఉంటుందని వాతావరణ శాఖ నిపుణలు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. దీంతో వడగాలులు కూడా వీస్తాయని, ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు బాగా పెరిగాయి. ఈ వేసవిలో ఎన్నడూలేనంతగా సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. మంగళవారం ఉదయం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించాడు.

తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
మధ్యాహ్నానికి మరింతగా విజృంభించడంతో, చాలా మంది ప్రజలు ఇళ్లు, కార్యాలయాల నుంచే బయటకు రావడానికి భయపడ్డారు. వడగాలులకు తోడు ఉక్కపోత కూడా తోడైంది. ఒక పక్క అప్పుడప్పుడు గాలులు వీస్తున్నా ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
నెత్తిపై గొడుగులు, ముఖానికి ముసుగులు వేసుకొని వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. విశాఖపట్నంలో ఇటీవల సంభవించిన హుదూద్ తుఫాన్ దెబ్బకి పచ్చని చెట్లన్నీ నేలకూలాయి.

తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
చాలా చోట్ల మోడుబారిన చెట్లే దర్శమిస్తున్నాయి. మరికొన్ని చెట్లు చిగురు తొడిగినా నీడనిచ్చేంత పచ్చదనం రాలేదు. గతంలో ఎన్నడూలేనంతగా మంగళవారం నాడు నగరంలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
ఈ వేసవికి ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. ఈ వేసవి తాపం మరికొన్ని రోజులు ఉంటుందని వాతావరణ శాఖ నిపుణలు హెచ్చరిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
రానున్న రోజుల్లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. దీంతో వడగాలులు కూడా వీస్తాయని, ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
మంగళవారం మధ్యాహ్నాం తెలంగాణలోని నిజామాబాద్‌లో రికార్డు స్ధాయిలో 46.1, రామగుండంలో 45.4, హైదరాబాద్‌లో 42.5 ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, నందిగామల్లో 43.8, నెల్లూరులో 43, కావలిలో 42.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
ఈ వేసవిలో ఇవే అత్యధికం. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణవైపు పొడిగాలులు వీస్తున్నాయి. అలాగే రాజస్థాన్, ఉత్తర భారతం నుంచి కూడా వేడిగాలులు తెలంగాణ, ఏపీలవైపు వీస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
వీటివల్ల ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగి వడగాలులు ఎక్కువగా వీస్తున్నాయి. రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా ఎక్కువగా నమోదవుతున్నందున ఉక్కపోత అధికంగా ఉంటోంది.












Click it and Unblock the Notifications