హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారీ వర్షం: ఇళ్లల్లో చేరిన నీరు, ఎత్తిపోశారు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నగరంలో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి పడ్డాయి. వర్షంతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం ఆవరించింది. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో గంటల కొద్దీ ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. చార్మినార్‌, యూసుఫ్‌గూడ, సికింద్రాబాద్‌, పంజాగుట్ట, ఉప్పల్‌, తార్నాక, లాలాపేట, ఎల్‌బినగర్, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల్లో వర్షం కారణంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌, రాంనగర్‌, నాగమయ్యగుట్ట, కంటోన్మెంట్‌, రాంగోపాల్‌ పేటలోని లోతట్టు ప్రాంతాల్లోకి వర్షం నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనాలు గంటకు పైగా రోడ్డుపైనే నిలిచిపోయాయి. కూకట్‌పల్లి, మియాపూర్‌, ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌, పంజాగుట్ట, నాంపల్లి, కోఠి, జీడిమెట్ల, చార్మినార్‌, హిమాయిత్‌నగర్‌, కోఠి ప్రాంతాల్లో వర్షపునీరు రోడ్లపై నిలిచిపోవడంతో స్థానికులు బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలో రాత్రి 8.30 గంటల వరకు 16.6 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

చార్మినార్‌ పాతబస్తీ, కందికల్‌ గేట్‌, ఉప్పుగూడ, శివాజీనగర్‌, రాజన్నబావి, అరుంధతీ కాలనీ బస్తీలలో ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇళ్లలోకి చేరిన వర్షపునీటిని బయటకు తోడిపోశారు. కాచిగూడ, హిమాయత్‌నగర్‌ వీధి నంబర్‌ 14లో నాలా పరివాహక ప్రాంతాల్లో వర్షపునీరు ఇళ్లలోకి చేరింది. నింబోలీ అడ్డా, కృష్ణానగర్‌, జియాగూడ, హబీబ్‌నగర్‌ నాలా చుట్టు పక్కల ప్రాంతాలు ప్రజలు భారీగా వరదనీరు చేరుకోవడంతో ఇబ్బందులకు గురయ్యారు.

సికింద్రాబాద్‌ స్టేషన్‌ గురుద్వారా ఎదురుగా, బైబిల్‌ హౌస్‌, బోయిగూడ వంతెన, మెట్టుగూడ వంతెన, బ్రాహ్మణబస్తీ, అల్లాడి పెంటయ్యనగర్‌లలో ఇళ్లలోకి వర్షపునీరు చేరింది. రాంనగర్‌, జాంబవి నగర్‌ ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపునీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్‌ న్యూ అశోక్‌నగర్‌ నాలా పక్కన ఉన్న గోడ కూలింది. అంబర్‌నగర్‌ బ్రాహ్మణబస్తీలో, పెద్దయ్య నగర్‌లో భారీగా వరద నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ఎక్సైజ్‌ శాఖ మంత్రి పద్మారావు ఆదేశాల మేరకు మూడు రెస్క్యూ బృందాలు సహాయ కార్యక్రమాలు చేపట్టాయి.

కూకట్‌పల్లి, మూసాపేట్‌, సికింద్రాబాద్‌, తార్నాక, హిమాయత్‌నగర్‌, వెంగళ్‌రావునగర్‌, రహ్మత్‌నగర్‌, బోరబండ ప్రాంతాల్లో నాలాలు, మ్యాన్‌ హోళ్లు పొంగి పొర్లాయి. పంజాగుట్ట, ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌, ఆబిడ్స్‌, హిమాయత్‌నగర్‌, చార్మినార్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, కృష్ణానగర్‌, లక్ష్మినర్సింహనగర్‌, అమీర్‌పేట మైత్రివనం చౌరస్తా, మూసాపేట, ఎర్రగడ్డ, సనత్‌నగర్‌, బాలానగర్‌ ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రపతి రోడ్‌, మహాత్మాగాంధీనగర్‌, మినిస్టర్స్‌ రోడ్‌, సంగీత్‌ చౌరస్తా, మెట్టుగూడ ప్రాంతాల్లో రోడ్లపై వర్షపునీరు నిలిచిపోయింది. వర్షపునీరు రోడ్లపై మోకాలిలోతు నిలిచిపోవడంతో ద్విచక్రవాహనాలు నిలిచిపోయాయి.

వర్షం కారణంగా బేగంపేటలో గంటకుపైగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. గ్రీన్‌ ల్యాండ్స్‌ నుంచి ఎయిర్‌పోర్టు వరకు ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో వాహనదారులు వానలో ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రపతి రోడ్‌, సంగీత్‌ చౌర స్తా, మెట్టుగూడ, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, సోమాజిగూడ నిమ్స్‌ ఆస్పత్రి రోడ్‌లో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. హిమాయత్‌నగర్‌, నారాయణగూడ, ఆబిడ్స్‌, అఫ్జల్‌గంజ్‌, బేగంబజార్‌, నాంపల్లి, ధూల్‌పేట, మంగళ్‌హాట్‌, జియాగూడ, గన్‌ఫౌండ్రీ, కోఠి ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్యలు నెలకొన్నాయి.

భారీ వర్షం

భారీ వర్షం

హైదరాబాద్‌ నగరంలో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి.

భారీ వర్షం

భారీ వర్షం

వర్షంతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం ఆవరించింది. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో గంటల కొద్దీ ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.

భారీ వర్షం

భారీ వర్షం

చార్మినార్‌, యూసుఫ్‌గూడ, సికింద్రాబాద్‌, పంజాగుట్ట, ఉప్పల్‌, తార్నాక, లాలాపేట, ఎల్‌బినగర్, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల్లో వర్షం కారణంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

భారీ వర్షం

భారీ వర్షం

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌, రాంనగర్‌, నాగమయ్యగుట్ట, కంటోన్మెంట్‌, రాంగోపాల్‌ పేటలోని లోతట్టు ప్రాంతాల్లోకి వర్షం నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

భారీ వర్షం

భారీ వర్షం

కూకట్‌పల్లి, మియాపూర్‌, ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌, పంజాగుట్ట, నాంపల్లి, కోఠి, జీడిమెట్ల, చార్మినార్‌, హిమాయిత్‌నగర్‌, కోఠి ప్రాంతాల్లో వర్షపునీరు రోడ్లపై నిలిచిపోవడంతో స్థానికులు బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి.

భారీ వర్షం

భారీ వర్షం

నగరంలో సాయంత్రం నుంచి రాత్రి 8.30 గంటల వరకు 16.6 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

భారీ వర్షం

భారీ వర్షం

చార్మినార్‌ పాతబస్తీ, కందికల్‌ గేట్‌, ఉప్పుగూడ, శివాజీనగర్‌, రాజన్నబావి, అరుంధతీ కాలనీ బస్తీలలో ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

భారీ వర్షం

భారీ వర్షం

ఇళ్లలోకి చేరిన వర్షపునీటిని బయటకు తోడిపోశారు. కాచిగూడ, హిమాయత్‌నగర్‌ వీధి నంబర్‌ 14లో నాలా పరివాహక ప్రాంతాల్లో వర్షపునీరు ఇళ్లలోకి చేరింది.

భారీ వర్షం

భారీ వర్షం

నింబోలీ అడ్డా, కృష్ణానగర్‌, జియాగూడ, హబీబ్‌నగర్‌ నాలా చుట్టు పక్కల ప్రాంతాలు ప్రజలు భారీగా వరదనీరు చేరుకోవడంతో ఇబ్బందులకు గురయ్యారు.

భారీ వర్షం

భారీ వర్షం

సికింద్రాబాద్‌ స్టేషన్‌ గురుద్వారా ఎదురుగా, బైబిల్‌ హౌస్‌, బోయిగూడ వంతెన, మెట్టుగూడ వంతెన, బ్రాహ్మణబస్తీ, అల్లాడి పెంటయ్యనగర్‌లలో ఇళ్లలోకి వర్షపునీరు చేరింది. రాంనగర్‌, జాంబవి నగర్‌ ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపునీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

భారీ వర్షం

భారీ వర్షం

సికింద్రాబాద్‌ న్యూ అశోక్‌నగర్‌ నాలా పక్కన ఉన్న గోడ కూలింది. అంబర్‌నగర్‌ బ్రాహ్మణబస్తీలో, పెద్దయ్య నగర్‌లో భారీగా వరద నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు.

భారీ వర్షం

భారీ వర్షం

కూకట్‌పల్లి, మూసాపేట్‌, సికింద్రాబాద్‌, తార్నాక, హిమాయత్‌నగర్‌, వెంగళ్‌రావునగర్‌, రహ్మత్‌నగర్‌, బోరబండ ప్రాంతాల్లో నాలాలు, మ్యాన్‌ హోళ్లు పొంగి పొర్లాయి.

English summary
Moderate to heavy rains in spells lashed different parts of Hyderabad on Thursday evening bringing down the temperatures in the city, which were on the rise in the last few days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X