ఏపీకి వాతావరణశాఖ చల్లటి కబురు
రానున్న రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి తమిళనాడు వరకు ఉన్న నిన్నటి ద్రోణి ప్రస్తుతం సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. మరఠ్వాడా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కర్ణాటక మీదగా విస్తరించి ఉంది. ఏపీ, యానాంలోని దిగువ ట్రోపోయావరణంలో నైరుతి గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
రాబోయే రెండురోజుల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. కొన్ని జిల్లాల్లో పొగమంచు ఒకటి, రెండు చోట్ల కురుస్తుందని అధికారులు వెల్లడించారు. దక్షిణ కోస్తాలో కూడా రాబోయే రెండు రోజుల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయని, అలాగే రాయలసీమలో కూడా తేలికపాటి వానలున్నాయని ఐఎండీ అంచనా వేస్తోంది.

ప్రస్తుతం వర్షాలు కురవడంవల్ల అవి తగ్గిపోయిన తర్వాత ఎండలు భగ్గుమనే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రమంతటా శీతాకాలం కొనసాగుతున్నప్పటికీ ఎండలు మండిపోతున్నాయి. ప్రతి ఏడాది వాతావరణశాఖ అంచనా ప్రకారం శివరాత్రి నుంచి ఎండలు పెరుగుతాయి. తాజాగా కురవబోయే వానలవల్ల రాష్ట్రమంతటా చల్లటి వాతావరణం ఏర్పడుతుందని, అయితే ఇది అత్యంత తక్కువరోజులే ఉంటుందని, రానున్నది వేసవి కాలం కాబట్టి ప్రస్తుతం కురిసే వానల ప్రభావం దానిపై ఉండనుంది. సాధారణంగానే ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. వర్షాలు తగ్గిన తర్వాత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే వర్షాలు కురిసినా ఇబ్బందే.. కురవకపోయినా ఇబ్బందే అన్నట్లుగా ఉండబోతోంది.












Click it and Unblock the Notifications