మళ్ళీ పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళను టార్గెట్ చేసి మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు వ్యూహాత్మకంగా ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో ప్రజలకు తమదైన శైలిలో ఎవరికివారు విజ్ఞప్తులు చేస్తున్నారు.
Recommended Video

తాజాగా గెలుపుకు గుర్రాలకే జనసేన టికెట్లు ఇస్తుందని, ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు సాగాలని ఆయన పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలకు ప్రతి సీటు కీలకమే అని పేర్కొన్న పవన్ కళ్యాణ్ టిడిపి జనసేన ప్రభుత్వం దశాబ్దం పాటు కొనసాగాలంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. 2024లో జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తప్పకుండా అధికారంలోకి వస్తుందన్నారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దే బాధ్యత తాము తీసుకుంటామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యల పైన మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన మంత్రి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లను మరోమారు టార్గెట్ చేశారు.
టీడీపీతో అలయన్స్ దశాబ్దకాలం కావాలంటావ్ ! మూడు ముళ్ళు మాత్రం మూడు రోజుల్లో తెంచేస్తావ్ ! అంటూ పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటాడు కానీ పవన్ కళ్యాణ్, మూడు ముళ్ళు వేసి పెళ్లి చేసుకున్న వివాహ బంధాన్ని మాత్రం మూడు రోజుల్లోనే తెంచేస్తాడని, అంతటి ఘనుడు పవన్ కళ్యాణ్ అంటూ మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు.
పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడినా మంత్రి అంబటి సెటైర్ వేయడానికి సిద్ధంగా ఉంటారు .ఈ క్రమంలోనే ఆయన తాజాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మరో మారు విరుచుకుపడ్డారు. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్న నాటి నుండి పవన్ కళ్యాణ్ చంద్రబాబుల పొత్తులను ఆయన టార్గెట్ చేసి విమర్శలు చేస్తూనే ఉన్నారు.












Click it and Unblock the Notifications