చంద్రబాబు,లోకేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి అదిరిపోయే పంచ్ లు!!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు (ap assembly session) జరుగుతున్నాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాలలో టిడిపి తీరుపై మంత్రి అంబటి రాంబాబు మరోమారు విరుచుకుపడ్డారు. టిడిపి సభ్యుల బాయ్ కాట్, చంద్రబాబు అరెస్టు (chandrababu arrest)ను సభలో ప్రస్తావించిన మంత్రి ప్రశ్నోత్తరాలలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పే అవకాశం ఈరోజు కలిగిందని పేర్కొన్నారు. టిడిపి సభ్యులు బాయ్ కట్ చేయడం వల్లే ఈరోజు సభ సజావుగా జరుగుతుందని పేర్కొన్నారు.

చంద్రబాబు స్కిల్ స్కాంపై చర్చకు రమ్మంటే టిడిపి సభ్యులు పారిపోయారని మంత్రి అంబటి రాంబాబు( minister ambati rambabu) ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో మీసాలు మెలేసి, తొడలు కొడుతున్నారని బాలకృష్ణను మళ్ళీ టార్గెట్ చేశారు మంత్రి అంబటి రాంబాబు. స్కిల్ స్కాంలో చంద్రబాబును సిఐడి అరెస్ట్ చేసిందని తెలిపారు. చంద్రబాబు పిటిషన్లను కోర్టు తిరస్కరిస్తుంది అంటే కేసు ఎంత బలంగా ఉందో అర్థమవుతుందని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.

Minister Ambati Rambabu punches to chandrababu, lokesh, balakrishna and pawan kalyan

ప్రజలు కూడా వాస్తవాన్ని గమనిస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు స్కిల్ స్కాం (chandrababu skill scam) పై చర్చించడానికి రమ్మంటే నానా రభస చేసిన టీడీపీ నేతలు దొంగల్లా పారిపోయారని పేర్కొన్నారు. చంద్రబాబు దొరికిన దొంగ ఇక తప్పించుకోలేరని పేర్కొన్న మంత్రి అంబటి.. బాబుతో పాటు, బాబు కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బును విపరీతంగా దోచుకున్నారని ఆరోపించారు.

రాజకీయాలను డబ్బు మయం చేసిన వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్న మంత్రి అంబటి రాంబాబు, ఎన్నో అన్యాయాలు, అక్రమాలతో చంద్రబాబు రాజ్యాధికారం చేశారని, అధికారం చేతిలో ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన దారుణాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని వెల్లడించారు. ఇప్పటివరకు దొరికినవే కాదు దొరకనివి ఇంకా చాలానే ఉండొచ్చని పేర్కొన్నారు.

సభలో ఈలలు వేస్తూ ఒకరు.. ఢిల్లీలో ఇంకొకరు.. ఎక్కడ ఉన్నాడో తెలియనివాడు మరొకడు అంటూ బాలకృష్ణ, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ లను సైతం టార్గెట్ చేశారు. తప్పు చేసారు కాబట్టి చంద్రబాబు అరెస్టు అయ్యారని ప్రజాస్వామ్యంలో ఎంత పెద్దవారైనా తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే అని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+