మంత్రి అంబటి వర్సెస్ అయ్యన్న.. మధ్యలో లోకేష్: తెలుగురాని సన్నాసి.. కామపిశాచి అంటూ ఘాటుగా!!

యువ గళం పాదయాత్ర చేస్తున్న లోకేష్‌పై మంత్రి అంబటి సెటైర్ వేశారు. అంబటికి అయ్యన్న అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటలు యుద్ధం కొనసాగుతుంది. ఒకరిని మించి ఒకరు డోసు పెంచి మరీ తిట్టుకుంటున్నారు. వైసీపీ కార్యక్రమాలను టార్గెట్ చేస్తూ టీడీపీ, టీడీపీ కార్యక్రమాలను తూర్పారబడుతూ వైసీపీ రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. ఇక గత కొద్ది రోజులుగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్ర కొనసాగిస్తున్న నేపథ్యంలో వైసిపి నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే.

లోకేష్ పాదయాత్రను టార్గెట్ చేస్తున్న మంత్రి అంబటి రాంబాబు

లోకేష్ పాదయాత్రను టార్గెట్ చేస్తున్న మంత్రి అంబటి రాంబాబు


ఇప్పటికే అంబటి రాంబాబు యువ గళం పాదయాత్ర ప్రారంభం నాడే లోకేష్ ను టార్గెట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర చేసిన ప్రతి ఒక్కడు నాయకుడు కాలేడు అంటూ నిప్పులు చెరిగారు. లోకేష్ 400 రోజుల పాదయాత్రను ఉద్దేశించి ఎలుక తోలు తెచ్చి 400 రోజులు ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు అంటూ, గావంచ కట్టినోడల్లా గాంధీ కాలేడు.. పాదయాత్ర చేసినోడల్లా నాయకుడు కాలేడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు అయ్యన్నపాత్రుడు అంబటి రాంబాబును టార్గెట్ చేసి ఎదురు దాడి చేశారు.

మరీ ఘాటుగా తిట్టిన అయ్యన్న .. సోషల్ మీడియాలో వార్

టెన్త్ క్లాస్ పేప‌ర్లు ఎత్తుకెళ్లిన దొంగోడు, జ‌నం సొమ్ము ల‌క్ష‌ల కోట్లు దోచిన ఏ1 జ‌గ‌న్‌ పాద‌యాత్ర చేయొచ్చా అర‌గంట అంబ‌టి? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కోడిక‌త్తిని తెచ్చి ఎన్నాళ్లు సాన‌బట్టినా అది న‌త్తి ప‌కోడీయే కానీ క‌త్తి కాదు అంటూ తీవ్రంగా విమర్శించారు. డ‌బ్బు కోసం జ‌నాల ప్రాణాలు తీసే బ్రాందీ అమ్మే జ‌గ‌న్ని అభిన‌వ గాంధీ అని ప్ర‌చారం చేసుకోవ‌డానికి సిగ్గులేదా? అంటూ మండిపడ్డారు.లోకేష్ పాద‌యాత్ర జ‌గ‌న్ స‌ర్కారుకి పాడెయాత్ర. ఆ శవం ముందు నీదే డ్యాన్సు కాంట్రాక్ట్‌. కొత్త స్టెప్పులు నేర్చుకోమంటూ ఓ రేంజ్ లో అంబటి రాంబాబుని తూర్పారబట్టారు అయ్యన్నపాత్రుడు. సోషల్ మీడియా వేదికగా వీరి ఘాటు వ్యాఖ్యల రచ్చ కొనసాగుతుంది.

తెలుగు రాని సన్నాసి లోకేష్ పై అంబటి

ఇక తాజాగా మరోమారు అంబటి రాంబాబు చేసిన పోస్ట్ తో మళ్లీ అంబటి రాంబాబుకు, అయ్యన్నపాత్రుడు కి మధ్య ట్విట్టర్ వేదికగా వార్ మళ్ళీ కొనసాగుతుంది. తాజాగా అంబటి రాంబాబు తెలుగువీర లేవరా.. తెలుగు రాని సన్నాసి సంగతేంటో తేల్చరా అంటూ నారా లోకేష్ ను టార్గెట్ చేశారు. లోకేష్ తెలుగు మాట్లాడడం రాని సన్నాసి అంటూ విరుచుకుపడ్డారు. లోకేష్ పాదయాత్ర పొడవునా ఆయన మాట్లాడుతున్న మాటలపై వైసీపీ నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

అంబటి పై అయ్యన్న అలా.. మాటకు మాట

అంబటి పై అయ్యన్న అలా.. మాటకు మాట

ఇక అంబటి రాంబాబు చేసిన పోస్టుకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చిన అయ్యన్నపాత్రుడు అంబటి రాంబాబును కామపిశాచి అంటూ టార్గెట్ చేశారు. కామ పిశాచి, కామ వాంఛ నుంచి బయటకు రారా అంటూ పోస్ట్ పెట్టారు. పోలవరం పూర్తి చెయ్యరా అంటూ హితవు పలికారు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అంబటి రాంబాబు ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేకపోతున్నారని టార్గెట్ చేస్తూ ఆయనను ఎద్దేవా చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+