పవన్ కళ్యాణ్ కోసం వైద్య శాఖకు మంత్రి అంబటి రాంబాబు షాకింగ్ రిక్వెస్ట్!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను మంత్రి అంబటి రాంబాబు టార్గెట్ చేస్తూనే ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభించిన నాటినుండి వరుసగా పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేసిన అంబటి రాంబాబు తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.వారాహి వాహనం ఎక్కిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
పవన్ మానసిక స్థితి సరిగా ఉండటం లేదని, అందుకే ఆ విధంగా పిచ్చిపిచ్చిగా వాగుతున్నాడు అని సెటైర్లు వేశారు.వారాహి వాహనం వెనుక అంబులెన్స్ ను ఏర్పాటు చేసి అందులో ఆయనకు మానసిక వైద్యాన్ని చేయడానికి మానసిక వైద్యుడిని అందుబాటులో ఉంచమని ఏపీ వైద్య శాఖను కోరుతున్నానని మంత్రి అంబటి రాంబాబు షాకింగ్ వ్యాఖ్యలు చేశారు .

మానసిక స్థితి బాగాలేని వారికి ఏ మందులు వాడతారో ఆ మందులను అంబులెన్స్ లో ఉంచమని చెప్పండని మంత్రి అంబటి రాంబాబు సూచించారు. మందులు ఇచ్చి వారాహి వాహనం ఎక్కించాలని, లేదంటే ఎవర్ని పడితే వాళ్లని లాక్కొచ్చి తంతారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ కు మందులు ఇచ్చి వైద్యం చేయించకపోతే జనసేన నేతలు చొక్కాలు చింపుతారని అంబటి రాంబాబు చురకలంటించారు.
పవన్ బట్టలిప్పి కొట్టడానికి ఇది సినిమా కాదని అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ పై ఘాటుగా విమర్శలు చేశారు. ఇప్పటికే చెప్పులు పోయాయి.. రేపు బట్టలు కూడా పోతాయి అంటూ పవన్ పై సెటైర్లు వేసారు అంబటి రాంబాబు పవన్ కంటే బ్రహ్మానందం గొప్ప మేధస్సు ఉన్నవాడని పేర్కొన్నారు.
బ్రహ్మానందం సినిమాల్లోనే నటిస్తారు అని బయట నటించరు. ఆయన బయట సీరియస్ గా ఉంటారు. పవన్ కంటే గొప్ప మేధావి. రామాయణ, భాగవతాలను చదివిన వ్యక్తి. కమెడియన్ బ్రహ్మానందం కూడా ఒక సినిమాకి 30 రోజుల కాల్షీట్స్ రోజుకు లెక్కగట్టి కోట్లు తీసుకున్న సందర్భాలున్నాయని పేర్కొన్నారు. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి నటిస్తూ కమెడియన్ లాగా రోల్ పోషిస్తున్నారని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications