వైసీపీని ప్రజలు క్షమించరు, ఆ పార్టీ నాయకులను దేవుడు కూడా కాపాడలేడు, ఆనం

ఆంధ్రప్రదేశ్ ప్రజలపై వైసీపీ నాయకులకు ఎలాంటి ప్రేమాభిమానాలు, సానుభూతి లేదని, ఐదు సంవత్సరాలు పాలించిన ఆ పార్టీ నాయకులు రాష్ట్రాన్ని దోచుకున్నారని, వరద బాధితులకు సహాయం చెయ్యడానికి ఆ పార్టీ నాయకులకు కనీసం చేతులు కూడా రావడం లేదని, వైసీపీ నాయకులను ప్రజలు క్షమించరని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు.

తిరుమలలో శ్రీవారిని దర్శనం చేసుకున్న తర్వాత మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రమ, పట్టుదలతో పని చేశారని, సాటి మంత్రులు, అధికారులు కష్టపడి పని చేయడం వల్లనే విజయవాడలో ఇంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా తన అనుభవంతో ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉంటారని మరోసారి రుజువు చేశారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.

Minister Anam accused the YCP leaders of doing injustice to the people of Andhra Pradesh

భారీ వర్షాలు, వరదల కారణంగా విజయవాడ ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే స్వార్థ రాజకీయాల కోసం వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపైన ఆరోపణలు చేస్తున్నారు తప్పా ఆ ప్రాంతంలోని ప్రజలను ఆదుకోవడానికి ఏమాత్రం ఆసక్తి చూపించలేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. విజయవాడ కూడా ఆంధ్రప్రదేశ్ లోనే ఉందని, ఐదు సంవత్సరాల పాలించడానికి అధికారం ఇచ్చిన ప్రజలకి, విజయవాడ నగర ప్రజలకు ఏం న్యాయం చేశాము అని వైసీపీ నాయకులు బహిరంగంగా చెప్పాలని ఆనం రామనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు.

గత వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖను బ్రష్టు పట్టించారని, పంచాయతీరాజ్ వ్యవస్థని వైసీపీ నాయకులు నాశనం చేశారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కల్యాణ్ కేవలం వంద రోజుల్లో పంచాయతీరాజ్ వ్యవస్థని సరి చేశారని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంత ప్రజలు సంతోషంగా ఉంటున్నారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.

Minister Anam accused the YCP leaders of doing injustice to the people of Andhra Pradesh

చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ని శ్రీ వెంకటేశ్వర చల్లగా ఆశీర్వదించాలని, వారు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని, ఇద్దరూ ఇంకా పదికాలాలపాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయడానికి ఆ దేవుడు శక్తిని ప్రసాదించాలని దేవుడిని కోరుకున్నానని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం విచారణ జరిపిస్తుందని, తప్పు చేసిన వారిని ఆ భగవంతుడు కూడా కాపాడలేడని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని మనస్పూర్తిగా కోరుకున్నానని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+