రోజా ఐరన్ లెగ్, అందుకే ఓటమి: అయ్యన్న
విశాఖపట్నం/ విజయనగరం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నగర శాసనసభ్యురాలు రోజా వంటి ఐరన్‌లెగ్ ఉంటే ఆ పార్టీలు ఎన్నికల్లో గెలవలేవని ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. గురువారం విశాఖ మాకవరపాలెంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రోజా మహిళ అయి వుండి నోటితో చెప్పలేని భాష మాట్లాడుతున్నారన్నారు.
తమ పార్టీ సీటు ఇచ్చినా గెలవలేని రోజాకు ముఖ్యమంత్రి చంద్రబాబు గురించిమాట్లాడే హక్కు లేదని అయ్యన్న అన్నారు. ఇప్పటికే ఐరన్‌లెగ్ అని రోజాకు పేరు ఉందన్నారు. వైసీపీలోకి వెళ్లి ఆ పార్టీని గెలవకుండా చేసిందన్నారు. ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు రుణమాఫీపై ఇచ్చిన హామీ త్వరలోనే నెరవేరుతుందని చెప్పారు.

విజయనగరం జిల్లా అన్నింటా వెనుకబడి ఉందన్న దృష్టితో ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు కృషి చేస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్‌రెడ్డి ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి మృణాళిని అన్నారు.
గురువారం విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రైతులు జగన్ మాటలను నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు రైతుల ఇష్ట ప్రకారమే జరుగుతుందని, రైతులకు ఇష్టం లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క సెంటు భూమి కూడా తీసుకోదని స్పష్టం చేశారు.
జిల్లాలోని తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసి ఈ ఏడాది జూన్ లేదా జూలైలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications