అనంతలో జర్మన్ హ్యాంగర్ టెక్నాలజీతో తాత్కాలిక కోవిడ్ ఆస్పత్రి-ప్రారంభించిన మంత్రి బొత్స..

అనంతపురం జిల్లాలోని జేఎన్‌టీయూకి సమీపంలో జర్మన్​ హ్యాంగర్​ టెక్నాలజీతో తాత్కాలిక కొవిడ్​ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. జిల్లా ఇన్​ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం(జూన్ 1) దీన్ని ప్రారంభించారు. విజయవాడ నుంచి వర్చువల్​ విధానంలో ఆస్పత్రి ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. కొవిడ్​ బాధితులకు సేవలందించేందుకు 20రోజుల వ్యవధిలోనే ఈ ఆస్పత్రిని సిద్ధం చేసిన జిల్లా అధికారులను మంత్రి అభినందించారు.

రూ.1.7 కోట్ల వ్యయంతో...

రూ.1.7 కోట్ల వ్యయంతో...

ఈ ఆస్పత్రిలో 300 పడకలు, ఆక్సిజన్​ బెడ్స్​ సదుపాయం ఏర్పాటు చేశారు. 43వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.1.7కోట్ల వ్యయంతో దీన్ని ఏర్పాటు చేశారు. 29 మంంది ఎంబీబీఎస్ వైద్యులు,ఏడుగురు స్పెషలిస్ట్ వైద్యులు,71 మంది స్టాఫ్ నర్సులు నలుగురు ఫార్మాసిస్టులు ఇక్కడ సేవలందిస్తున్నారు. పేషెంట్ల కోసం ప్రత్యేకంగా 54 తాత్కాలిక టాయిలెట్లను ఏర్పాటు చేశారు. షెడ్డు లాంటి నిర్మాణంలో ఏర్పాటు చేసిన ఈ ఆస్పత్రిలో పేషెంట్లకు బయటి గాలి,వెలుతురు లభిస్తుందని చెబుతున్నారు.

తాడిపత్రిలో మరో ఆస్పత్రి...

తాడిపత్రిలో మరో ఆస్పత్రి...

ఇదే అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలోనూ జర్మన్​ హ్యాంగర్​ టెక్నాలజీతో 500 పడకల తాత్కాలిక కోవిడ్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్‌ విధానంలో దీన్ని ప్రారంభించనున్నారు. తాడిపత్రి శివారులోని ఆర్జా ఉక్కు కర్మాగారం సమీపంలో దీన్ని నిర్మించారు. ఆ పరిశ్రమ నుంచి రోగుల పడకల వద్దకే ఆక్సిజన్ అందించనున్నారు. ఇందుకోసం సర్జ్ ట్యాంకు నిర్మించి పరిశ్రమ నుంచి 700 మీటర్ల పైపులైను ఏర్పాటు చేశారు.

ఇంతకుముందు తెనాలిలోనూ...

ఇంతకుముందు తెనాలిలోనూ...

ఇంతకుముందు,జర్మన్‌ హ్యాంగర్‌ టెక్నాలజీతో తెనాలిలో వ్యవసాయ మార్కెట్‌లోనూ తాత్కాలిక కోవిడ్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు.పక్కనే ఉన్న ప్రభుత్వ వైద్యశాలలో కోవిడ్ నుంచి కోలుకుంటున్నవారిని ఈ షెడ్‌లోకి షిఫ్ట్ చేసి చికిత్స అందిస్తున్నారు.ఇక్కడ ఆక్సిజన్‌ సదుపాయంతో పాటు నిరంతరం వైద్యులు అందుబాటులో ఉంటూ పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని గమనిస్తున్నారు. కాగా,కోవిడ్‌పై పోరులో అనంతపురం జిల్లా అధికారులు తమదైన మార్క్ చాటుకుంటున్నారు.

ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కోవిడ్ కేర్ సెంటర్లలో యోగా,ధ్యానం,వ్యాయామ సెషన్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా నుంచి కోలుకుంటున్నవారితో ప్రతీరోజూ ఉదయం యోగాసనాలు,ధ్యానం,తేలికపాటి వ్యాయామం చేయిస్తున్నారు. తద్వారా కోవిడ్ రోగుల మానసిక,శారీరక ఆరోగ్యం మెరుగుతుపడుతుందని... వ్యాధి నుంచి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు చెబుతున్నారు.కోవిడ్ కేర్ సెంటర్లలో పూర్తిగా పాజిటివ్ వాతావరణం ఉండేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. యోగా,ధ్యానంతో పాటు షటిల్,వాలీబాల్ వంటి ఆటలు,మ్యూజిక్,పాటలతో అక్కడి వాతావరణాన్ని పాజిటివ్‌గా ఉంచుతున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+