షాకింగ్: 'పక్క రాష్ట్రాలకు ఉప్పందిస్తున్న వైయస్ జగన్, విజయ సాయి కూడా'
జగన్, విజయ సాయి రెడ్డి పక్క రాష్ట్రాలకు ఉప్పందిస్తూ ప్రజా ద్రోహానికి పాల్పడుతున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మండిపడ్డారు.
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రానికి ఉప్పందిస్తున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు బుధవారం నాడు నిప్పులు చెరిగారు. పోలవరం పనులను జగన్ అడ్డుకుంటున్నారన్నారు.
ఆ పనులకు జగన్ సైంధవుడిలా తయారయ్యారని విమర్శించారు. జగన్, విజయ సాయి రెడ్డి పక్క రాష్ట్రాలకు ఉప్పందిస్తూ ప్రజా ద్రోహానికి పాల్పడుతున్నారన్నారు. జగన్ ఎన్ని కుట్రలు చేసినా పోలవరాన్ని అడ్డుకోలేరన్నారు.
పోలవరాన్ని అడ్డుకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోవడం ఖాయమన్నారు. పోలవరంను పూర్తి చేయడానికి రూ.2,200 కోట్లు నాబార్డు నుంచి తీసుకు రావడానికి ప్రయత్నిస్తుంటే జగన్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్నారు. జగన్ అయోమయ పరిస్థితిలో, ఏడాదిలో ఎన్నికలు వస్తాయనడం హాస్యాస్పదం అన్నారు.
జగన్‌పై కాల్వ నిప్పులు
కష్టాల్లో ఉన్న ఏపీని అభివృద్ధి పథంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తుంటే ప్రతిపక్షనేత జగన్ అడ్డుపడుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు.
అమరావతి నిర్మాణానికి అడ్డుపడిన జగన్.. నేడు పోలవరం ప్రాజెక్టుకు అడ్డుతగులుతున్నారన్నారు. పట్టిసీమను నిండు సభలో వ్యతిరేకించిన వైసిపి నాయకులు నేడు రాయలసీమకు ఆ ప్రాజెక్టు ద్వారా నీళ్లు వస్తుంటే ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications