ఆ దమ్ము లేదు కానీ, సీఎం పదవి కోసం చిందులా?: జగన్‌పై దేవినేని ఫైర్
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్వార్థ ప్రయోజనాల కోసమే జై ఆంధ్రప్రదేశ్ పేరుతో విశాఖపట్నంలో ప్రత్యేక హోదా కోసం సభ నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.
జగన్ రాష్ట్రప్రయోజనాల దృష్ట్యా పోరాడడం లేదని, ముఖ్యమంత్రి పదవి కోసం మాత్రమే ఆరాటపడుతున్నారని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదాకు అనర్హుడని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ఏపీ సీఎం చంద్రబాబా? లేక టిడిపి ప్రభుత్వమా? అని ఆయన ప్రశ్నించారు.

ప్రధాని నరేంద్ర మోడీ పేరు పలికే దమ్ముకూడా లేని జగన్ రాష్ట్రంలో చిందులు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా వాసులను తీసుకువచ్చి రైతుల కోసం నిర్మిస్తోన్న పోలవరం ప్రాజెక్టుకు ఆటంకాలు కలిగించాలని చూస్తున్నారని ఆరోపించారు. అంతేగాక, సుప్రీంకోర్టులో కేసులు వేస్తూ రాష్ట్రాభివృద్ధిని అడ్డకుంటున్నారని అన్నారు. పోలవరం అడ్డకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
జగన్ కళ్ల ముందు జైలు ఊచలు కనిపిస్తున్నాయని, అందుకే రోడ్లమీదకెక్కి చిందులు తొక్కుతున్నారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తిచేసేలా చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications