ఉల్లి లొల్లి: అధికారులను నిలదీసిన మంత్రి గంటా (ఫోటోలు)
విశాఖపట్నం: ఉల్లికష్టాలు ఇప్పట్లో తీరేటట్టు కనిపించడం లేదు. రోజు రోజుకు ఉల్లి పాట్లు ఎక్కువవుతున్నాయే తప్ప తగ్గడం లేదు. అధికారులు ఎన్ని చర్యులు తీసుకున్నా డిమాండ్ తగ్గ సరుకు లేకపోవడంతో ఉల్లిపాయ కూడా దొరకడం గగనంగా మారింది. మరోవైపు ఉల్లిదొంగతనాలు జోరందుకుంటున్నాయి.
ఉల్లియాలను తూచే తూకాల్లో కూడా మోసాలు ఎక్కువయ్యాయి. బహిరంగ మార్కెట్‌లో వీటి ధరలను నియంత్రించేందుకు తీసుకున్న చర్యలు ఏ మాత్రం సత్ఫలితాలను ఇవ్వడం లేదు. రైతు బజార్లలలోనే హోల్ సేల్, రిటైల్ మార్కెట్లలలో సైతం బోర్డుల్లో అధికారులు నిర్దేశించిన ధరల కంటే కనీసం 20 శాతం అదనంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

ఉల్లి లొల్లి: అధికారులను నిలదీసిన మంత్రి గంటా
గ్రామీణ ప్రాంతవాసులకు ఉల్లిపాయ చూద్దామంటే కనిపించని పరిస్థితి నెలకొంది. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న 12 రైతు బజార్లలో ఇప్పటి రవకు అధికారిక లెక్కల ప్రకారం 9562.20 మెట్రిక్ టన్నల ఉల్లిపాయల విక్రయాలు జరిగాయి.

ఉల్లి లొల్లి: అధికారులను నిలదీసిన మంత్రి గంటా
వీటిలో కనీసం 20 శాతం పక్కదారి పట్టినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు రైతు బజార్ల ద్వారా రోజుకు 30 నుంచి 40 మెట్రిక్ టన్నుల ఉల్లివిక్రయాలు జరుగుతుండగా ఈరోజు నుంచి స్టాక్‌ను పెంచుతున్నారు.

ఉల్లి లొల్లి: అధికారులను నిలదీసిన మంత్రి గంటా
ఇవన్నీ రికార్డులకే పరిమితమవుతున్నాయే తప్ప వాస్తవానికి ఆ స్థాయిలో అమ్మకాలు జరగడంలేదనే విమర్శలు వస్తున్నాయి. బుధవారం కంచరపాలెం రైతు బజార్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి గంటా శ్రీనివాసరావు అక్కడ ఉన్న అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఉల్లి లొల్లి: అధికారులను నిలదీసిన మంత్రి గంటా
ఏర్పాట్లు ఇలా చేస్తే ఎలా అంటూ నిలదీశారు. బుధవారం రాత్రికి కర్నూలు నుంచి 60 ఎంటీల దిగుబడి చేస్తున్నారు. గురువారం 11 రైతుబజార్లకు అదనంగా నగరంలోని సూపర్ బజార్‌తో పాటు తగరపు వలస లోని పుట్ బాల్ గ్రౌండ్‌లో కూడా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉల్లి లొల్లి: అధికారులను నిలదీసిన మంత్రి గంటా
స్టీల్ ప్లాంట్‌లోని రైతు బజార్ లో మాత్రం గురువారం విక్రయాలను నిలిపివేశారు. రోజు రోజుకు పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని దాదాపు అన్ని రైతు బజార్లలో ప్రస్తుతం ఉన్న కౌంటర్లను రెట్టింపు చేస్తున్నారు.

ఉల్లి లొల్లి: అధికారులను నిలదీసిన మంత్రి గంటా
తోపులాటలు జరగకుండా ఉండేందుకు దాదాపు అన్ని రైతు బజార్లలో ప్రత్యేకంగా బారికేడ్స్‌ను ఏర్పాటు చేశారు. అలాగే స్టాక్‌ను పెంచుతున్నారు.

ఉల్లి లొల్లి: అధికారులను నిలదీసిన మంత్రి గంటా
నిన్నటి వరకు తెల్లకార్డుపై కిలో ఉల్లి పాయలు మాత్రమే ఇస్తుండగా, గురువారం నుంచి రెండు కిలోలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. అదే విధంగా కౌంటర్ల వద్ద మంచినీరు తదితర ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications