Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం..ఉపరాష్ట్రపతి వెంకయ్య, సీఎం జగన్ తో పాటు రాజకీయప్రముఖుల దిగ్భ్రాంతి

ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో గుండెపోటుతో చికిత్సపొందుతూ హఠాన్మరణం పొందారు. సోమవారం ఉదయం 8 గంటల 45 నిమిషాలకు ఆయన తుది శ్వాస విడిచారు. గౌతమ్ రెడ్డి ఐసియులో చేర్చి అత్యవసర సేవలు అందించినా ఫలితం దక్కలేదు. ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల రాజకీయ ప్రముఖులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, తెలంగాణా నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Recommended Video

    Mekapati Goutham Reddy ప్రస్థానం.. గౌతమ్ రెడ్డి ఇమేజ్ ప్రత్యేకం|Andhra Pradesh | Oneindia Telugu

    గౌతమ్ రెడ్డి చిన్న వయసులోనే దూరం కావటం బాధాకరం: ఉపరాష్ట్రపతి

    మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి ఎంతో సౌమ్యులు. సంస్కారవంతులు అని పేర్కొన్నారు. సమస్యల పట్ల అవగాహన, చేసే పని పట్ల నిబద్ధత కలిగిన నాయకుడు అని కొనియాడారు. గౌతమ్ రెడ్డి తాత గారి సమయం నుంచి వారి కుటుంబంతో తనకు సాన్నిహిత్యం ఉందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. గౌతమ్ రెడ్డి తాను అంటే ఎంతో అభిమానం చూపేవారని, చిన్న వయసులోనే దూరం కావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

    యువ మంత్రివర్గ సహచరుడిని కోల్పోవడం మాటల్లో చెప్పలేనంత బాధ కలిగించింది : వైఎస్ జగన్

    యువ మంత్రివర్గ సహచరుడిని కోల్పోవడం మాటల్లో చెప్పలేనంత బాధ కలిగించింది : వైఎస్ జగన్

    రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి యువ నాయకుడు ఆయన పేర్కొన్నారు. తనకు తొలినాళ్ళనుండి గౌతమ్ రెడ్డి సుపరిచితమైన వ్యక్తిని జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన యువ మంత్రివర్గ సహచరుడిని కోల్పోవడం మాటల్లో చెప్పలేనంత బాధ కలిగించిందని ఆయన పేర్కొన్నారు. భారమైన హృదయంతో ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం అని జగన్ వెల్లడించారు.

    దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి

    దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి

    మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం గురించి తెలుసుకుని హుటాహుటిన హైదరాబాద్ కు చేరుకున్నారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి అనిల్ కుమార్ ఓ మంచి స్నేహితుడిని, ఒక అన్నను కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్న వయసులోనే గౌతమ్ రెడ్డి చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారని, ఆయన హఠాన్మరణం బాధాకరమని పేర్కొన్నారు.

    మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చిన్న వయసులోనే గౌతమ్ రెడ్డి మనల్ని వదిలి వెళ్ళటం బాధాకరమని, మంత్రిగా చాలా చురుగ్గా ఆయన పని చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులలో అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. గౌతమ్ రెడ్డి మరణం పార్టీకి, ప్రజలకు తీరని లోటు అన్నారు.

    ఏపీలో పెట్టుబడుల కోసం ఆయన ఎంతగానో కృషి చేశారు: ఏపీ డిప్యూటీ సీఎంలు

    ఏపీలో పెట్టుబడుల కోసం ఆయన ఎంతగానో కృషి చేశారు: ఏపీ డిప్యూటీ సీఎంలు

    ఏపి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మంత్రి గౌతమ్ రెడ్డి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నతనంలోనే గౌతమ్ రెడ్డి క్యాబినెట్లో ప్రత్యేక స్థానాన్ని పొందారని నారాయణస్వామి పేర్కొన్నారు. గౌతమ్ రెడ్డి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఏపీ ఉపముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

    చిన్న వయసులోనే ఆయన మరణం బాధాకరమని మంత్రి పేర్కొన్నారు. ఏపీలో పెట్టుబడుల కోసం పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రిగా గౌతమ్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. నిన్నటి వరకు రాష్ట్రంలో పెట్టుబడుల కోసం దుబాయి లో పర్యటించిన మేకపాటి గౌతమ్ రెడ్డి ఇక లేరు అనే వార్త కలచి వేసిందని, మేకపాటి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని ఆయన తెలిపారు.

    చివరి నిమిషం వరకు రాష్ట్ర శ్రేయస్సు కోసం పని చేశారు: బొత్సా సత్యన్నారాయణ

    చివరి నిమిషం వరకు రాష్ట్ర శ్రేయస్సు కోసం పని చేశారు: బొత్సా సత్యన్నారాయణ

    మేకపాటి హఠాన్మరణం పట్ల మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మంత్రి మేకపాటి హఠాన్మరణం తనను కలచి వేసిందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. చివరి నిమిషం వరకు రాష్ట్ర శ్రేయస్సు కోసం పాటుపడిన సహచరుడిని కోల్పోయానని ఆయన తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాం అని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తున్నట్లుగా తెలిపారు.

    గౌతమ్ రెడ్డి మృతి బాధించింది: తెలంగాణా మంత్రి తలసాని, టీపీసీసీ రేవంత్ రెడ్డి

    మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి మృతి చాలా బాధాకరం అని ఆయన పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సానుభూతిని తెలియజేశారు. ఇదిలా ఉంటే మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మేకపాటి అకాల మరణం నన్ను కలచి వేసిందని మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్న నేత చిన్నవయసులోనే కన్నుమూశారని ఆవేదన వ్యక్తం చేశారు మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

    గౌతమ్ రెడ్డి కుటుంబానికి చంద్రబాబు, అచ్చెన్నాయుడు, లోకేష్, సోమిరెడ్డి ప్రగాఢ సానుభూతి

    మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబానికి టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆయన హఠాన్మరణం పై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం తనను తీవ్రంగా కలచి వేసిందని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదగాలని పని చేస్తున్న గౌతమ్ రెడ్డిని మృత్యువు కబళించింది అని ఆవేదన వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి పార్టీలతో సంబంధం లేకుండా అందరితో ఆప్యాయంగా కలిసి పోయే వారని, హుందాగా ప్రవర్తించే వారని ఆయన పేర్కొన్నారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం అని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు అచ్చెన్నాయుడు .

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+